వైసీపీకి బిగ్ షాక్.. ఆ జిల్లాలో 227 గన్ లైసెన్స్ లు రద్దు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైఎస్ఆర్సిపి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతున్న వేళ కడప జిల్లా కలెక్టర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లాలో 227 తుపాకీ లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కడప జిల్లా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన చర్చకు కారణమైంది.

గన్ లైసెన్సులు తీసుకున్నవారిపై ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత అధికార వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారంగా గన్ లైసెన్సులు జారీ చేసిందన్న ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లు, గూండాలు, రౌడీలు, కబ్జాదారులు కూడా గన్ లైసెన్సులు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన వేళ గన్ లైసెన్సులు తీసుకున్న వారిపైన అనేక ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.

Kadapa District Collector issued orders cancelling 227 gun licenses after inquiry shock for ysrcp

గన్ లైసెన్స్ దారులపై కంప్లైంట్స్ తో దర్యాప్తు

లైసెన్స్ దారులు తుపాకులతో ప్రజలను బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కంప్లైంట్స్ రావడంతో దీనిపైన అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ముఖ్యంగా కడప జిల్లాలో ఈ ఆరోపణల పైన జిల్లా అధికారులు ప్రత్యేక పోలీసు బృందాలతో లోతైన దర్యాప్తును చేశారు. జిల్లాలో మొత్తం 854 లైసెన్సులు జారీ అయితే, అందులో 227 మంది లైసెన్స్ దారులు వివిధ నేరాలలో పాల్గొన్నట్టు గుర్తించారు.

లైసెన్స్ లు రద్దయిన వారిలో ఎక్కువమంది వైసీపీ నేతలే

వీరిలో 11 మంది కరుడుగట్టిన నేరస్తులని, మరో ముగ్గురు నిబంధనలను ఉల్లంఘించి తుపాకులతో నేరాలు చేశారని పోలీసులు నిర్ధారించారు. జిల్లా ఎస్ పి సిఫార్సులతో కడప జిల్లా కలెక్టర్ 227 మంది గన్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఈ విధంగా రద్దు చేసిన గన్ లైసెన్సుల జాబితాలో చాలామంది వైసిపి నేతలు ఉన్నారని సమాచారం.

గన్ లైసెన్సులను రద్దు చేయడంతో కొంతమంది వైసీపీ నేతలకు షాక్

కడప జిల్లా కలెక్టర్ గన్ లైసెన్సులను రద్దు చేయడంతో కొంతమంది వైసీపీ నేతలకు షాక్ తగిలినట్టైంది. ముఖ్యంగా జమ్మలమడుగు కు చెందిన మల్కి రెడ్డి హనుమంత రెడ్డి తో పాటు, గతంలో పులివెందుల కాల్పుల నిందితుడు అయిన భరత్ యాదవ్ లైసెన్సులను రద్దు చేశారు. అలాగే వీరపునాయునిపల్లె మండలం పాయసం పల్లెకు చెందిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి లైసెన్స్ రద్దయింది.

ఆ నియోజకవర్గాలలోనే గన్ లైసెన్స్ లు రద్దు

కమలాపురం అప్పాయ పల్లికి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాసుల రెడ్డి లైసెన్స్, కడప ఎస్బిఐ కాలనీకి చెందిన షేక్ జాకీర్ లైసెన్సులు రద్దు చేయబడ్డాయి. వీరంతా గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ అండదండలతో లైసెన్సులు పొందారని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కడప, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల లోనే అధికంగా లైసెన్సులు రద్దయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+