అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని తొలుత సీబీఐ అధికారులు చెప్పారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కోర్టు సీబీఐకి ఆదేశాలు జారీచేసింది. సీబీఐ అదనపు ఎస్పీ ముఖేశ్ శర్మ అవినాష్‌రెడ్డికి వాట్సాప్ లో సీఆర్పీపీసీ 160 కింద నోటీసులు పంపడంతో సీబీఐ కార్యాలయం నుంచి మధ్యలోనే అవినాష్ వెనుదిరిగారు.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ ఆదివారం అవినాష్‌రెడ్డికి మరోసారి నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. విచారణ కోసం అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. విచారణ వాయిదా వేసినట్లు సమాచారం అందడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు. అయితే అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ చేసిన ధర్మాసనం మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు పిలువొచ్చంటూ సీబీఐకి తెలిపింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, అనుచరుడు ఉదయ్‌కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగిన వాదనలు ముగిశాయి. 10రోజులపాటు ఇద్దరినీ తమ కస్టడీకివ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications