పులివెందుల పులులెక్కడ ? నీ ఇంటికొచ్చి కూర్చుంటాం..! ఆదికి అవినాష్ కౌంటర్..!

ఏపీలో పులివెందుల రాజకీయం ఏడాది పొడవునా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వైఎస్ కుటుంబానికి అడ్డాగా చెప్పుకునే పులివెందులలో ఆధిపత్యానికి గండికొట్టేందుకు దశాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రతిసారీ ప్రత్యర్థులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఈ పట్టణంలో ఆధిపత్యం తమదేనని చెప్పుకుంటున్న కూటమి పార్టీలు సందర్భంతో సంబంధం లేకుండా వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి.

ఇదే క్రమంలో తాజాగా పులివెందుల పులులు ఎక్కడా అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. దీనికి ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఓవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తాము ఉద్యమాలు చేస్తుంటే మధ్యలో ఈ ఆదినారాయణరెడ్డి, సోదినారాయణరెడ్డి ఎవరంటూ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పులివెందుల పులులు ఎక్కడని ప్రశ్నించాడని, ఇక్కడ కనిపించడం లేదా అంటూ పులివెందులలో భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణుల్ని చూపించారు.

Kadapa mp ys avinash reddy strong counter to bjp mla adinarayana reddy s pulivendula tiger remark

రాష్ట్రమంతా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణరెడ్డి గురించి అవసరమా మనకు అంటూ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఆదినారాయణరెడ్డి పులివెందుల వాళ్లందరినీ రెచ్చగొట్టాడని, పులివెందుల పులులంట ఏం పీకుతారని మాట్లాడుతున్నారని అవినాష్ ఆక్షేపించారు. తమ వాళ్లు సంయమనంగా ఉన్నారు కాబట్టే ఆదినారాయణరెడ్డి ఇలాంటి కూతలు కూస్తున్నారని, వారు సంయమనం కోల్పోతే మీ ఇంట్లోకి వచ్చి కూర్చొంటారని అవినాష్ రెడ్డి హెచ్చరించారు. కాబట్టి మర్యాదగా మాట్లాడాలని ఆదినారాయణరెడ్డికి అవినాష్ హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+