చంద్రబాబును గౌరవిస్తామని కడియం, అధికారం ఉండదని నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర పర్యటనను తాము అడ్డుకోమని, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆయనను తాము గౌరవిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కడియ శ్రీహరి శుక్రవారం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పించాలని సూచించారు. ఎర్రబెల్లికి కడియం సవాల్ కూడా విసిరారు. మంచి పాలన అందిస్తున్న కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. ఎర్రబెల్లికి దమ్ముంటే చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్‌లా ఏపీ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇప్పించాలన్నారు.

చంద్రబాబు, మోడీలపై నారాయణ ధ్వజం
ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీల పైన సీపీఐ నేత నారాయణ శుక్రవారం చిత్తూరు జిల్లాలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే చంద్రబాబు అధికారం కోల్పోతారని విమర్శించారు. విద్యుత్ ఛార్చీలను పెంచి ప్రజల పైన భారం మోపవద్దన్నారు.
కేంద్రాన్ని చూసి చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులు తేవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్నారు. కృష్ణా నదిలో ఆక్రమిత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
ఢిల్లీలో బీజేపీ ఘోరంగా ఓడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పతనానికి ఢిల్లీ ఎన్నికలు నాంది పలుకుతున్నాయని చెప్పారు. తిరుపతి వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకునేలా చంద్రబాబు కృషి చేయాలన్నారు. కాగా, టౌన్‌లోని పదెకరాల స్థలం తమదేనని టీటీడీ వెయి మందికి పైగా నోటీసు ఇచ్చింది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇది తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications