వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
ఏపీలో అటు నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇటు ప్రధాన పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర తూర్పు గోదావరిలో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లో ఈ రోజు జగన్ రోడ్ షో కొనసాగనుంది. పిఠాపురం లో పవన్ ను ఓడించేందుకు వైసీపీ కొత్త స్కెచ్ సిద్దం చేసింది. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. గోదావరి జిల్లాల్లో టీడీపీ,జనసేన నేతల పైన వైసీపీ గురి పెట్టింది.
వైసీపీలో చేరికలు
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో తూర్పు గోదారిలోని పలు నియోజకవర్గాలకు చెందిన ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరారు. ఇదే సమయంలో గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పలువురు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలకు పార్టీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.

పిఠాపురం నేతల చేరిక
పిఠాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన పంతం ఇందిరతో సహా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు జగన్ న కలిసారు. పంతం నెహ్రూ, పంతం ప్రసాద్ వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు జిల్లా జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ప్రచారంలో కలిసి పని చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో జనసేన నేతగా కీలక బాధ్యతలు నిర్వహించిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

ఆపరేషన్ గోదావరి
అదే విధంగా.. నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి తదితరులు సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు తోట సుబ్బారావు నాయుడు, ముత్యాల శ్రీనివాస్ వైసీపీలో జాయిన్ అయ్యారు. కాగా, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీసీ ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు వైసీపీ కండువా కప్పుకున్నారు.












Click it and Unblock the Notifications