చంద్రబాబు స్కిప్ట్ చదువుతున్న పవన్-ముద్రగడపై అవాకులా ?-ద్వారంపూడి కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగు చేస్తున్న ప్రతి ఎకరా నుంచి ఓ బస్తా ద్వారంపూడి కుటుంబానికి వెళ్తోందని నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రైతు కుటుంబాల కన్నీటి మీద ద్వారంపూడి కుటుంబం వ్యాపారం చేస్తోందన్నారు. కష్టం రైతులది అయితే.. దాన్ని అమ్ముకొని అధికారం చెలాయిస్తోంది మాత్రం ద్వారంపూడి కుటుంబమే అన్నారు. అధికారం మీరు అనుభవిస్తూ.. రైతులను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. రైతు కన్నీరు మంచిది కాదు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

పవన్ ఆరోపణలపై ఇవాళ స్పందించిన ద్వారంపూడి.. తనపై లేని నిందలు వేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ మాట్లాడుతున్నారన్నారు. కుల ప్రస్తావన లేకుండా పవన్ మీటింగ్ ఉండదన్నారు. అమరావతి భూములు ఓ కులం చేతుల్లో ఉన్నాయన్నారు. కాకినాడలో అవినీతి, అక్రమాలు, లంచగొండితనాన్ని అస్సలు సహించనన్నారు. 50ఏళ్లుగా తమ కుటుంబం రైస్ మిల్ రంగంలో ఉందని ద్వారంపూడి తెలిపారు.

 ysrcpmladwarampudi

కాకినాడ జనసేన నాయకులు ఎవరిని పవన్ పట్టించుకోలేదని ద్వారంపూడి ఆరోపించారు. వారాహిపై ఒక్కరినైనా ఎక్కించుకున్నారా?? ఓ ఒక్కరైనా పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించారా ? అని ప్రశ్నించారు. ముందు మీ నాయకుడిని ప్రశ్నించండి ఆ తరువాత నన్ను విమర్శించాలని జనసేన నేతలకు సూచించారు. పవన్ తన ప్రతీ ప్రసంగంలో కులాల ప్రస్తావన ఎందుకు చేస్తున్నారని ద్వారంపూడి ప్రశ్నించారు. తాను అమరావతిని కమరావతి అన్నానని, భూములన్ని ఆ సామాజికవర్గం చేతుల్లో ఉన్నాయి కాబట్టే అన్నానన్నారు. ఇప్పటికి ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని ద్వారంపూడి తెలిపారు.

ముద్రగడ పద్మనాభం ఎవరి ప్రలోభాలకు లొంగిపోయే వ్యక్తి కాదని, కాపు ఉద్యమం కోసం ఆయన రాజకీయ జీవితాన్ని పళంగా పెట్టారని ద్వారంపూడి కితాబిచ్చారు. అటువంటి వ్యక్తిపై కొందరు కుక్కలు అవాకులు చెవాకులు పేలుతున్నారని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ నారా వారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నాడన్నారు. టీడీపీ స్క్రిప్ట్ పవన చదువుతున్నాడన్నారు. గంజాయి అక్రమ బియ్యం రవాణా అంటూ పవన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ద్వారంపూడి విమర్శించారు. జాతీయ స్దాయిలో నాలుగో బెస్ట్ లివింగ్ సిటీ అయిన కాకినాడకు అపవాదు అంటగట్టేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వ్యక్తిగతంగా ఉంటే ఎన్నికల్లో పోటీ చేద్దామని, తాను విసిరిన సవాల్ స్వీకరించకుండా తోకముడిచిన వ్యక్తివి నువ్వు అని ద్వారంపూడి ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+