వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంట్రుకంటారా?: ఆ పార్టీతో పొత్తా?: జగన్‌పై మంత్రి కామినేని తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లోనూ టీడీపీ-బీజేపీలు కలిసే పోటీ చేస్తాయన్నారు.

బుధవారం మంత్రి కామినేని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రం కేటాయించిన నిధులపై బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పినవన్నీ 100శాతం వాస్తవాలేనని అన్నారు.

పవన్! ఎలా నమ్మాలి? బాబుపై అలా.. జగన్‌పై ఇలా: నాశనం చేస్తున్నారని ఏకేసిన అంబటిపవన్! ఎలా నమ్మాలి? బాబుపై అలా.. జగన్‌పై ఇలా: నాశనం చేస్తున్నారని ఏకేసిన అంబటి

వైసీపీతో అవకాశం లేదు

వైసీపీతో అవకాశం లేదు

టీడీపీ-బీజేపీ స్నేహంతోనే ఏపీ అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని మంత్రి కామినేని అన్నారు. భవిష్యత్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

Recommended Video

No Confidence Motion : Better To Take Chance By Which Party ?
జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు

జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు

నీతి, నిజాయితీ, మంచితనానికి ప్రతిరూపం ప్రధాని నరేంద్ర మోడీ అయితే.. అవినీతి, అరాచకానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. అవినీతి కేసుల్లో 16నెలలు జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్ముతామని అన్నారు.

వెంట్రుకంటారా?

వెంట్రుకంటారా?

టీడీపీ-బీజేపీ విడిపోతే కొందరు లబ్ధిపొందాలని అనుకుంటున్నారని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, కొందరు టీడీపీ నేతలు బీజేపీని వెంట్రుకతో పోల్చడం సరికాదని మంత్రి కామినేని అన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పారు.

ప్యాకేజీకి అందుకే ఒప్పుకున్నాం

ప్యాకేజీకి అందుకే ఒప్పుకున్నాం

ఏపీకి ప్రత్యేక హోదా అవసరమేనని టీడీపీ ఎమ్మెల్యే బీదా రవిచంద్ర అన్నారు. అయితే, హోదా పేరు కావాలా? లేక అంతకుమించిన నిధులు కావాలా? అని కేంద్రం అడిగితే ఏపీ ప్రభుత్వం ప్యాకేజీకి అంగీకరించిందని చెప్పారు. హోదాకు మించిన ప్రయోజనాలు, నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని సాయం చేస్తామని చెప్పారని రవిచంద్ర గుర్తు చేశారు.

English summary
Andhra Pradesh minister and BJP leader Kamineni Srinivas on Wednesday fired at YSRCP president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X