వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోము వీర్రాజుకు కన్నా ట్విట్టర్ శుభాకాంక్షలు- ఫోన్ కూడా చేయలేరా అంటూ పార్టీలో గుసగుసలు..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అద్యక్షుడిగా తాజాగా అధిష్టానం నియమించిన సీనియర్ నేత సోము వీర్రాజుకు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా నియమించబడిన సోము వీర్రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కన్నా ట్వీట్ చేశారు. అయితే నేరుగా ఫోన్ చేసి వీర్రాజుకు శుభాకాంక్షలు చెప్పే వీలున్నా కన్నా ఇలా ట్విట్టర్ ద్వారా చెప్పడం చర్చనీయాంశమైంది.

ఇప్పటికే ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆయన వ్యతిరేక వర్గం కూడా ఉంది. గతంలో పలు కీలక అంశాల్లో ఈ వర్గం కన్నాకు సహకరించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కన్నా వ్యతిరేక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు హైకమాండ్ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడంతో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కన్నా సోముకు నేరుగా ఫోన్ చేయకుండా ఇలా ట్విట్టర్ మెసేజ్ పెట్టి ఊరుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. అయినా పార్టీలో సీనియర్ నేత కూడా అయిన సోము వీర్రాజుకు కన్నా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పలేరా అంటూ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.

kanna lakshminarayana wishes his successor somu veerraju in twitter
English summary
andhra pradesh bjp's former president kanna lakshminarayana send his wishes to his successor somu veerraju in twitter today amid rumours about their relations with in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X