జోగయ్య, ముద్రగడ అజెండా క్లియర్ ? నిన్న అలా.. ఇవాళ ఇలా..!

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి ఎన్నికల్లో పోరాడతామని మూడేళ్ల క్రితమే ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అందుకు తగ్గట్టే బీజేపీతో ఉంటూనే టీడీపీతో జట్టు కట్టారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల్ని కలుపుకుని ఎన్నికల్లో ఉమ్మడి పోటీకి సిద్దమవుతున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా జనసేన తీసుకున్న సీట్ల వ్యవహారంలో కాపు నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం .. నిత్యం పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. కాపుల పేరుతో వీరు పవన్ ను టార్గెట్ చేయడంలో తప్పు లేకపోయినా ఇప్పుడు వారి వారసులు వైసీపీ గడప తొక్కుతుండటంతో అనుమానాలు మొదలయ్యాయి.

నిన్న మొన్నటి వరకూ హరిరామ జోగయ్య టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అధికారంలో భాగస్వామి కావాలని, టీడీపీతో సమానంగా సీట్లు కోరాలంటూ పవన్ పై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత టీడీపీ జనసేన అభ్యర్ధుల ప్రకటన రావడంతో 24 సీట్ల కేటాయింపుపై భగ్గుమన్నారు. మధ్యలో ఓసారి పవన్ తో కలిసి టీడీపీ ముందు పెట్టాల్సిన డిమాండ్లు చెప్పేశారు. చివరికి అవి కాస్తా నెరవేరకపోవడంతో జోగయ్య మీ ఖర్మ అంటూ తేల్చేశారు. ఇప్పుడు పవన్ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యప్రకాష్ ను వైసీపీలోకి పంపేశారు.

kapu leaders harirama jogaiah and mudragada padmanabhams anti-pawan agenda revealed

అటు ముద్రగడ గతంలో వైసీపీలోకి చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తాను కోరిన సీట్లు ఇస్తే ఓకే అన్నారు. ఈ మేరకు అంతా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల ప్రకటన తర్వాత సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం ముద్రగడ కోరిన సీట్లు ఇవ్వకపోవడమే. దీంతో తిరిగి పవన్ వైపు మొగ్గి లేఖలు రాయడం మొదలుపెట్టారు. పవన్ తన దగ్గరికి వస్తానని రాకపోవడంతో అలిగారు. చివరికి వైసీపీలోకి వెళ్లేందుకు తిరిగి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు చల్లారావు భవిష్యత్తు కోసం పిఠాపురం సీటుపై సంప్రదింపులు చేస్తున్నారు.

ఇలా అయితే జనసేన లేదంటే వైసీపీ అన్నట్లుగా సాగుతున్న కాపు నేతలు ముద్రగడ, జోగయ్య రాజకీయం ఇప్పుడు కాపుల్లో కుంపటి పెడుతోంది. వీరు ఇన్నాళ్లు చేసిన డిమాండ్లు, పవన్ ముందు పెట్టిన టార్గెట్లు.. ఇప్పుడు వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వీరి అజెండాలు వేరే ఉన్నాయనే చర్చ సాగుతోంది. అవేవీ ఫలించకపోవడంతో నేరుగా వైసీపీలో చేరేందుకు సిద్దమైపోతున్నట్లు తెలుస్తోంది. వీలైతే వైసీపీలో నేరుగా చేరడం లేదా తమ వారసుల్ని అక్కడికి పంపేసేందుకు జోగయ్య, ముద్రగడ చేస్తున్న ప్రయత్నాలు కాపుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+