ఏపీలో డీకే శివకుమార్ పర్యటన-జగన్, వైఎస్, షర్మిలతో అనుబంధంపై వ్యాఖ్యలు..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయంలో కీలక పాత్ర పోషించి కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు అప్పటికే ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి కొనసాగిస్తున్న డీకే శివకుమార్ నిన్న ఏపీకి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రరాజవరం మండలం చిలకపాడులో శివాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శివకుమార్ పాల్గొన్నారు. శివకుమార్ కు తణుకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అరిమిల్లి రాధాకృష్ణ ఘనస్వాగతం పలికారు.
ఉండ్రాజవరంలో శివుడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక హోమ కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఆలయ దర్మకర్త చిటికెల వెంకటేశ్వరరావు ఆహ్వనం మేరకు శివకుమార్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన ముచ్చటించారు. స్ధానిక పరిస్ధితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు షర్మిల, వారి తండ్రి వైఎస్సార్ తో అనుబంధం గుర్తుచేసుకున్నారు.

కష్టపడి పని చేయడమే ఎన్నికల్లో తమ విజయ రహస్యమని కర్నాటక డిప్యూడీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తామన్నారు. సమిష్టి కృషితో విజయం సాధించామని ఆయన తెలిపారు. బీజేపీ అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం, కుంభకోణాలు బహిర్గతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ కర్ణాటకలో ఫలించదని నిరూపించామన్నారు. ప్రధాని సహా అనేక మంది మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించారని, ప్రతీ ఇంట్లో పెరిగిన ధరలపై మండి పడుతున్నారని డీకే తెలిపారు.
కర్నాటకలో ప్రజలు మార్పు కోరుకున్నారని, మార్పు కోసం తమను నమ్మారని డీకే శివకుమార్ తెలిపారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనను అభినందించడానికే కలిశారని డీకే వెల్లడించారు. ఆమె తన సోదరిలాంటిదన్నారు.వైఎస్ రాజశేఖరెడ్డి, వైఎస్ జగన్ లతో తనకు మంచి పరిచయం ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక గొప్ప నాయకుడని డీకే శివకుమార్ కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications