అధిష్టానంపై కావూరి ఫైర్, టిడిపిలోకి నో: తెరాసలోకి గౌడ్

మాగంటి బాబును వెనక్కి లాగే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. తన కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయిన అనంతరం తాను భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఏలూరు ఎంపీగా మాగంటి బాబు గెలిచే అవకాశాలు ఉంటే అడ్డుకోనని, ఆయనను వెనక్కి లాగనని చెప్పారు. ఆయనను బాధపెట్టి టిడిపికిలోకి వెళ్లాలనుకోవడం లేదన్నారు. టిడిపితో తానేమీ సంప్రదింపులు జరపలేదన్నారు.
కాంగ్రెసు పార్టీ హైకమాండులో అసమర్థ నాయకత్వం ఉందని నిప్పులు చెరిగారు. సొంత పార్టీ నేతలనే అధిష్టానం పట్టించుకోలేదన్నారు. ఏ పార్టీని అయినా కలుపుకొని అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు. తన వారసులు రాజకీయాల్లోకి రావడం వారి ఇష్టమని తెలిపారు. తనకు పార్టీ కంటే ప్రజలు ముఖ్యమన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా కాకుండా, పదవీ కాంక్షతోనే ముందుకు పోతోందని ఆయన ఆరోపించారు. తాను పార్టీలో ఉండాలా, వద్దా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకొంటానని ఆయన చెప్పారు.
తెరాసలోకి జైపాల్ యాదవ్, రసమయి, శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో టిడిపి నేత జైపాల్ యాదవ్, ప్రముఖ కళాకారులు రసమయి బాలకిషన్, మాజీ టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్‌లు కారు ఎక్కారు. వారికి కెసిఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications