కేసీఆర్ అన్ని తిట్టినా బీజేపీపై పోరుకు కలిసొస్తామంటే వెల్కమ్ అంటున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ ఎన్ని తిట్టినా స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు. అసలు తెలంగాణలో తెలుగు దేశం పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం చేసి తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినా సరే ఆయన మాత్రం మోడీపై పోరాటానికి కలిసొస్తామంటే రండి అనే పిలుస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి వైసీపీతో కలిసి కుట్రలు చేశాడని తిట్టిన నోటితోనే చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు .

తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తమ పోరాటానికి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఎన్నికల ఫలితాల ముందు పావులు కదుపుతున్న కేసీఆర్ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా చంద్రబాబు దానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. అంతే కాదు ఫెడరల్ ఫ్రంట్ మీద ఎలాంటి కామెంట్ చెయ్యలేదు. ఇక కేసీఆర్ గురించి అడిగితే చంద్రబాబు ఆసక్తికర సమాధానం చెప్పారు. ముందు ఈ అంశంపై మాట్లాడే సమయం కాదన్న చంద్రబాబు అనంతరం తాము బీజేపీపై పోరాటం చేస్తున్నామని తమతో కలిసి పోరాటం చేసేందుకు ఏ పార్టీ కలిసి వచ్చినా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు . దానర్ధం కలిసొస్తే కేసీఆర్ తో కలిసి పని చేద్దామనేగా .

KCR abused Chandrababu ..but Chandrababu welcomes to fight against BJP

ఇప్పటికి ఎన్నోసార్లు చంద్రబాబు కేసీఆర్ స్నేహహస్తం ఆశించి భంగపడ్డారు. కేసీఆర్ చంద్రబాబుతో దోస్తీకి మొదటి నుండి సంసిద్ధంగా లేరు. చంద్రబాబు అన్న పేరు వింటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే కేసీఆర్ ఎన్నికల సమయంలో , ఆ తర్వాత కూడా చంద్రబాబును వీలు దొరికినప్పుడల్లా తిట్టిపోశారు. ఇక కేసీఆర్ ఎన్ని సార్లు నో అన్నా చంద్రబాబు పదే పదే కలిసి పని చేద్దాం రా అంటూ ఆహ్వానించటం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+