వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు కోసం: కేసీఆర్ ప్రకటన, కేబీఆర్ ఫైరింగ్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి పైన జరిగిన కాల్పుల పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. నిత్యానంద రెడ్డిని అగంతకుడు డబ్బులు కావాలని డిమాండ్ చేసినట్లుగా కేసీఆర్ తెలిపారు.

నిత్యానంద రెడ్డి వాకింగ్ ముగించుకొని కారు ఎక్కే సమయంలో ఆయనతో పాటు ఓ అగంతకుడు కారులోకి ఎక్కాడని కేసీఆర్ తెలిపారు. అగంతకుడు ఏకే 47 చూపించి డబ్బులు డిమాండ్ చేశారన్నారు. ఇరువురి మధ్య పెనుగులాట జరిగి, బుల్లెట్లు కారు బాడీలోకి దూసుకెళ్లాయన్నారు. నిత్యానంద తమ్ముడు ప్రసాద రెడ్డి అగంతకుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. ఆయన చేతి కొరికి పారిపోయాడని తెలిపారు.

ఇందుకు సంబంధించి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయిందని, 307, 363 సెక్షనల కింద కేసు నమోదు చేశారన్నారు. ఈ కాల్పులలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అగంతకుడు ఉపయోగించిన రైఫిల్ గ్రేహౌండ్స్‌కు చెందినదిగా గుర్తించారని, అది గత డిసెంబర్ 26వ తేదీన మిస్ అయిందని, దీని పైన నార్సింగి పోలీసు స్టేషన్లో కేసు నమోదయిందన్నారు. పోలీసులు కేసు చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసున్నాయి. అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసున్నాయి. అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో దెబ్బతిన్న నిత్యానంద రెడ్డి కారు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో దెబ్బతిన్న నిత్యానంద రెడ్డి కారు అద్దాలు పగిలాయి.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు. కారును పరిశీలిస్తున్న పోలీసులు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు. కారును పరిశీలిస్తున్న పోలీసులు. కారు లోపల ఏకే 47ను గుర్తించారు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు. కారు లోపల ఏకే 47ను గుర్తించారు. కారును పరిశీలిస్తున్న పోలీసులు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు. కారును పరిశీలిస్తున్న పోలీసులు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు. కారును పరిశీలిస్తున్న పోలీసులు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

కేబీఆర్‌ పార్కు వద్ద కాల్పుల కలకలం రేగింది. అరబిందో ఫార్మసీ వైస్‌ చైర్మన్‌ నిత్యానందరెడ్డిపై ఓ ఆగంతకుడు కాల్పులకు యత్నించాడు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

బుధవారం ఉదయం కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌ ముగించుకుని నిత్యానందరెడ్డి, అతని సోదరుడు కారులో బయలు దేరడానికి సిద్ధమయ్యారు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

అదే సమయంలో ఓ ఆగంతకుడు ఆకస్మాత్తుగా కారులోకి ప్రవేశించి నిత్యానంద రెడ్డి పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌ తుపాకీ ఉంచి హిందీలో బెదిరించాడు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

అగంతకుడి హెచ్చరికలతో వెంటనే అప్రమత్తమైన నిత్యానందరెడ్డి ఆత్మరక్షణ కోసం ఆగంతకుడి వద్ద ఉన్న గన్‌ను లాక్కునే ప్రయత్నం చేశాడు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

దుండగుడితో నిత్యానంద రెడ్డి, అతని సోదరుడు పెనుగులాడటంతో దుండగుడి చేతులోని గన్‌ ఫైర్‌ అయ్యింది. ఎనిమిది బుల్లెట్లు రిలీజ్‌ అవడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

వెంటనే అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడు కారు ముందు నుంచి పరిగెత్తుకుంటూ అన్నపూర్ణ స్టూడియో వైపు పారిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్‌ చేస్తున్నామని ఆగంతకుడు చెప్పాడు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారులో ఏకే-47 గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

కారు ముందు వెనుభాగంలో బుల్లెట్లు లభ్యమయ్యాయి. డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దుండగుడు ఆధునాత న ఆయుధాన్ని ఉపయోగించాడు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఫోరెన్సిక్‌, ఫింగర్‌ప్రింట్స్‌ నిపుణులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను, క్లూస్‌ను సేకరించారు.

కేబీఆర్ పార్క్

కేబీఆర్ పార్క్

నిత్యానంద రెడ్డిపై కాల్పులకు వినియోగించిన తుపాకీ గ్రేహౌండ్స్‌కు చెందినదిగా గుర్తించారు. విశాఖ అడవుల్లో మాయమైన గ్రేహౌండ్స్‌ ఏకే-47గా తెలుస్తోంది. గతంలో తుపాకీ మిస్సింగ్‌పై నార్సింగి పీఎస్‌లో గ్రేహౌండ్స్‌ ఫిర్యాదు చేయగా ఆయుధం అదృశ్యంపై విచారణ చేపట్టారు.నిత్యానంద రెడ్డి పైన కాల్పుల విషయంలో సస్పెండైన పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏకే 47 కనిపించకుండా పోయిన కేసులో ఏడుగురిని సస్పెండ్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Telangana Cm K Chandrasekhar Rao announces on KBR firing issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X