తెలంగాణ నుంచి జగన్ కు ఫోన్ కాల్..
నేడు- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు. 53వ బర్త్ డేను జరుపుకొంటోన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీలో పలు చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పలు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో కేక్ లను కట్ చేస్తోన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు పవన్ కల్యాణ్, మల్లు భట్టి విక్రమార్క, భారతీయ జనతా పార్టీ నాయకుడు కే రవిచంద్రారెడ్డి.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసిన వారలో ఉన్నారు. నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని వారందరూ ఆకాంక్షించారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తన అన్నకు బర్త్ డే విషెస్ తెలిపారు.

మరోవంక- భారత రాష్ట్ర సమితి నాయకులు జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు.. ప్రత్యేకించి- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అభిమానులు జగన్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తోన్నారు. వైఎస్ జగన్- కేటీఆర్ ను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. ఇదివరకు బెంగళూరులో జగన్- కేటీఆర్ కలిసిన ఫొటోలను వాటికి జత చేస్తోన్నారు.
అటు కేటీఆర్ స్వయంగా వైఎస్ జగన్ కు ఫోన్ చేసి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ- శాసన సభా పక్ష సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ భవన్ కు బయలుదేరడానికి ముందు కేటీఆర్.. జగన్ కు ఫోన్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఇది- వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి అద్దం పట్టినట్టయింది.
తన హయాంలో బీఆర్ఎస్ తో సఖ్యతను, మిత్రత్వాన్ని కొనసాగించారు వైఎస్ జగన్. కొన్ని సందర్భాల్లో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమైన రోజులు కూడా ఉన్నాయి. కేసీఆర్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు జగన్. ప్రారంభంలో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయపరమైన విభేదాలు ఉన్నప్పటికీ కాలక్రమేణా అవి తగ్గిపోయాయి. సత్సంబంధాలు ఏర్పడ్డాయి.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
రాజ్యసభలో అమరావతి బిల్లుపై రూటు మార్చిన వైసీపీ, అనూహ్య డిమాండ్..!! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం











Click it and Unblock the Notifications