ఏమీ చేయని కేసీఆర్ 88 సీట్లలో : మనం ఎన్ని సీట్లలో గెలవాలి : నో ఛాన్స్‌..!

ఎన్నిక‌ల‌కు పార్టీ శ్రేణుల‌ను టిడిపి అధినేత చంద్ర‌బాబు స‌మాయ‌త్తం చేస్తున్నారు. టిడిపి గెలిస్తేనే..ఏపిని కాపాడుకోగ లిగేద‌నే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు. ఎన్నిక‌ల ఏడాది కావ‌టంతో..ఇది చాలా కీల‌క స‌మ‌య‌మ‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌ను దిశా నిర్ధేశం చేసారు. తెలంగాణ లో కేసీఆర్ గెలుపు ను..ఏపి లో టిడిపి గెలుపు తో పోలుస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు.

మోదీది అదే భ‌యం.. ఏపిని కాపాడుకోవాలి..

మోదీది అదే భ‌యం.. ఏపిని కాపాడుకోవాలి..

టిడిపి అధినేత చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో టెలి కాన్పిరెన్స్ నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ఏడాది ప్రారంభం కావ‌టంతో.. ప్ర‌తీ సంద‌ర్భంలోనూ చంద్ర‌బాబు పార్టీని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. గ‌తం కంటే భిన్నంగా రాజకీయాల పై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్న చంద్ర‌బాబు..పార్టీ నేత‌ల‌ను అందుకు స‌మాయ‌త్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవాలని ..రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నేతలకు తెలిపారు. దుష్టశక్తులు పార్టీపై, రాష్ట్రంపై కక్ష కట్టాయని మండిపడ్డారు. తానేదో ఆక్రోశంలో ఉన్నానని మోదీ అంటున్నారని, ఏపీకి సహకరిస్తే అభివృద్ధిలో మించిపోతామనే భయం మోదీది అని ఆయన విమర్శించారు. మోదీ అడుగడుగునా ఏపీ అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆరోపించారు. హుందాతనం లేకుండా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఎక్కడ నిలదీస్తారో అని ఏపీ పర్యటన రద్దు చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. సెంటిమెంట్ ను ప్ర‌ధానంగా న‌మ్ముకున్నట్లుగా క‌నిపిస్తున్న చంద్ర‌బాబు..మోదీ-కేసీఆర్‌- జ‌గ‌న్ ల‌క్ష్యంగా రాజ‌కీయ విమ‌ర్శ‌లు కంటిన్యూ చేస్తున్నారు..

కేసుల మాఫీ కోసం జ‌గ‌న్ కు అధికారం..

కేసుల మాఫీ కోసం జ‌గ‌న్ కు అధికారం..

రాజ‌కీయంగా బిజెపితో విభేదించిన‌ప్ప‌టి నుండి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌ధానంగా మోదీని లక్ష్యంగా చేసుకున్నా రు. రాష్ట్రంలో జ‌గ‌న్ ను ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా భావిస్తున్న టిడిపి...ఏపికి అన్యాయం చేసిన మోదీ.. కేసీఆర్ తో జ‌గ‌న్ జ‌త క‌ట్టారంటూ ప్ర‌జ‌ల్లో వైసిపి పై వ్య‌తిరేక భావం తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మోదీ, అమిత్‌షా, కేంద్ర మంత్రు లు ప్రచారం చేస్తే ఒక్క సీటు గెలిచారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కూటమి విఫలమని బీజేపీ నేతలు అంటున్నార ని, టీడీపీని జీరో చేస్తేనే బీజేపీకి గెలుపుగా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ గెలిస్తే తన అసమర్ధ త బయటపడుతుందని కేసీఆర్ భయమన్నారు. కేసుల మాఫీ కోసం జగన్‌కు అధికారం కావాలని వ్యాఖ్యానించారు. అధికారం కోసం మోదీ, కేసీఆర్‌తో జగన్ జతకట్టారని, మోదీ, జగన్, కేసీఆర్ ఏపీపై పగబట్టారని దుయ్యబట్టారు. టిడిపి ముగ్గురు మోదీలతో పోరాడుతోంద‌ని నేతలకు చంద్రబాబు వివ‌రించారు.

ఏం చేయ‌ని కేసీఆర్ కు 82 సీట్లు..మ‌రి ఏపిలో మ‌న‌కు..

ఏం చేయ‌ని కేసీఆర్ కు 82 సీట్లు..మ‌రి ఏపిలో మ‌న‌కు..

ఏపిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఏక‌పక్షంగా ఉండాల‌ని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. ఏపిలో ప్ర‌తిపక్షానికి ఎక్కడా అవకాశం ఇవ్వరాదన్నారు. చేసిన మంచి పనులను ప్రజలు గుర్తించేలా చేయాలని సూచించారు. 25 ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లలో గెలుపే టిడిపి లక్ష్యం కావాల‌ని లక్ష్యమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఏమీ చేయని కేసీఆర్ 88 సీట్లలో గెలిచారని, అన్నీ చేసిన మనం ఎన్ని సీట్లలో గెలవాలని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆ కసి రావాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదే స‌మ‌యం లో టిడిపి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌ధ‌కాల ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి..పాజిటివ్ ఓటింగ్‌తో గెల‌వాల‌నేది టిడిపి లక్ష్యంగా క‌నిపిస్తోంది. మ‌రి..ఎన్నిక‌ల నాటి కి రాజ‌కీయ ప‌రిస్థితులు ఎటువంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+