నమస్తే తెలంగాణ లక్ష్మీరాజంకు సీటు: కెసిఆర్ ఆఫర్

హైదరాబాద్: నమస్తే తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో) లక్ష్మీరాజంకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని ఆయన చెప్పారు. బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు శుక్రవారం కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఆ విషయం చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులకు కొన్ని సీట్లు ఇస్తామని చెప్పారు. కెప్టెన్ లక్ష్మీకాంత రావు కుమారుడికి హుస్నాబాద్ సీటు ఇచ్చామని కెసిఆర్ చెప్పారు. మరో ఎమ్మెల్సీ సీటు బ్రాహ్మణులకు ఇస్తామని ఆయన చెప్పారు. మాజీ ఐఎఎస్ అధికారి రమణాచారికి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో తగిన స్థానం కల్పిస్తుందని ఆయన చెప్పారు.

KCR offers Rajya Sabha seat to lakshmi rajyam

ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీరాజం నమస్తే తెలంగాణ పత్రికను స్థాపించి నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రాతినిధ్య పత్రికగా అది పేరు పొందింది. ఆ తర్వాత ఓ ఇంగ్లీషు దినపత్రికను కూడా ఆయన నెలకొల్పారు. లక్ష్మీరాజంతో కెసిఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

నమస్తే తెలంగాణ పత్రిక స్థాపనలో కెసిఆర్ ప్రధాన పాత్ర పోషించారు. తొలుత నిర్వహణ బాధ్యతను ఆయనే చేపట్టారు. ఆ తర్వాత దాని నుంచి ఉపసంహరించుకున్నారు. తెరాస అధికారిక టీవీ చానెల్‌గా టీ న్యూస్ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+