బీఆర్ఎస్ ఏపీ ఎంట్రీతో నష్టం వీరికే ? పవన్ నే నమ్మని కాపులు కేసీఆర్ పై ? వారిని కలిపే ఈక్వేషన్ !

ఏపీలో సంక్రాంతి తర్వాత లాంఛనంగా అడుగుపెట్టేందుకు కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అంతకంటే ముందే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ జనసేన నేత తోట చంద్రశేఖర్ ను నియమించేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను ఏపీ అధ్యక్షుడిగా ఎంచుకోవడం ద్వారా ఇక్కడ తమ ప్రాధాన్యతలేంటో కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ నే పూర్తిగా నమ్మని కాపులు.. ఈసారి బీఆర్ఎస్ ను ఎంత మేరకు నమ్ముతారు. మధ్యలో బీజేపీ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉండటం అంతిమంగా ఎవరికి కలిసి రానుంది ?

ఏపీలో బీఆర్ఎస్ రాజకీయం

ఏపీలో బీఆర్ఎస్ రాజకీయం

ఏపీలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ త్వరలో అడుగుపెట్టబోతోంది. ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కాపులకు పెరుగుతున్న ప్రాధాన్యత ఇప్పుడు జనసేన, బీజేపీతో పాటు బీఆర్ఎస్ ను ఆలోచనలో పడేస్తోంది. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా ఎంచుకుని బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడుతోంది. దీంతో ఇప్పటివరకూ కాపుల్ని నమ్ముకుని రాజకీయాలు చేసిన వారికి చుక్కలు కనిపించడం ఖాయం. అదే సమయంలో కాపుల కోసం పోరు కూడా ముమ్మరం కాబోతోంది.

పవన్ నే నమ్మని వారు కేసీఆర్ ను నమ్ముతారా ?

పవన్ నే నమ్మని వారు కేసీఆర్ ను నమ్ముతారా ?

ఏపీలో కాపు సామాజిక వర్గంలో ప్రధాన ఆకర్షణ కలిగిన నేతలుగా గతంలో చిరంజీవి చెలామణి అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, వంగవీటి రాధా, గంటా శ్రీనివాసరావు వంటి వారు చెలామణి అవుతున్నారు. ఎంత కాదన్నా వీరి చుట్టే ఇప్పుడు కాపు రాజకీయం తిరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఆయన నేరుగా ఇక్కడి రాజకీయం చేసే అవకాశం లేదు కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను ఎంచుకున్నారు. కానీ కాపు రాజకీయాన్ని తమవైపుకు తిప్పుకోవడం వీరికి సాధ్యమవుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్ధితి. ఎందుకంటే కాపులు ఇప్పటికే తమ సామాజికవర్గానికి చెందిన పవన్ నే పూర్తిగా నమ్మడం లేదు. అలాంటిది తోట చంద్రశేఖర్ నో, కేసీఆర్ నో నమ్మే పరిస్దితి కనిపించడం లేదు.

టీడీపీ-జనసేన-బీజేపీకి చికాకు ?

టీడీపీ-జనసేన-బీజేపీకి చికాకు ?

అయితే కేసీఆర్ కాపు రాజకీయాన్ని నమ్ముకుని ఏపీలో ఇస్తున్న ఎంట్రీ విపక్షంలోని మూడు పార్టీల్ని ప్రధానంగా చికాకు పెట్టబోతోంది. ఇందులో టీడీపీలో కాపు నేతలంతా ఇప్పటికే సీనియర్లు, మాజీ మంత్రులుగా, సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారే. కానీ జనసేన-బీజేపీలో నేతల పరిస్దితి అలా కాదు. వీరంతా ఇతర పార్టీల్లో నుంచి ఇక్కడికి ఫిరాయించిన ద్వితీయ శ్రేణి నేతలే ఎక్కువ. అదే సమయంలో ఈ మూడు పార్టీల్లోని కాపు నేతల్ని బీఆర్ఎస్ ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయడం ఖాయం. ఇందుకు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్నవారి ఆస్తిపాస్తుల్ని టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే ఇంతకాలం కాపు ఓటు బ్యాంకు ఆధారంగా రాజకీయాలు చేస్తున్న జనసేనకు ఎక్కువగా, బీజేపీ, టీడీపీల్ని కాస్త అటు ఇటుగా బీఆర్ఎస్ చికాకు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

జగన్ కు మేలు చేస్తున్న కేసీఆర్ ?

జగన్ కు మేలు చేస్తున్న కేసీఆర్ ?

విపక్షంలో ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన లో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలే టార్గెట్ గా బీఆర్ఎస్ పావులు కదపడం మొదలుపెట్టేసింది. దీంతో ఈ మూడు పార్టీలు బీఆర్ఎస్ ను త్వరలో పూర్తిస్దాయిలో టార్గెట్ చేయబోతున్నాయి. ఇప్పటికే జనసేన నేతలు బీఆర్ఎస్ తీరుపై మండిపడుతున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుకు కారణమైన బీజేపీతో దోస్తీలో ఉన్న జనసేనను ఆ పార్టీ ఎలాగో చికాకుపెట్టడం ఖాయం. అదే సమయంలో బీజేపీ-టీడీపీలో కాపు నేతలు కూడా ఆ పార్టీల్ని వీడి బీఆర్ఎస్ లో కలిస్తే అది అంతిమంగా ఈ ముగ్గురి భవిష్యత్ కూటమి వ్యూహాలకు దెబ్బ కానుంది. అలాగే కేసీఆర్ నుంచి ఎదురయ్యే సవాల్ ఈ ముగ్గురిని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలపడం కూడా ఖాయం. దీంతో తెలంగాణలో బీజేపీ, ఏపీలో జగన్ కు ఓట్ల చీలికతో బీఆర్ఎస్ మేలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+