Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పివి మరణం కలచివేసింది: కెసిఆర్ (ఫొటోలు)

హైదరాబాద్: మాజీ భారత ప్రధాని పివి నర్సింహారావు మృతి తనను కలచివేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. హైదరాబాదులో త్వరలో పివి స్మారక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఝానభూమి వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన శనివారం ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఓ జిల్లాకు, ఓ విశ్వవిద్యాలయానికి పివి పేరు పెడతామని ఆయన ప్రకటించారు.

తెలుగుజాతి ఖ్యాతి పివి ఆయన ప్రశంసించారు. దేశంలో తొలిసారి భూసంస్కరణల చట్టాన్ని తెచ్చిన ఘనత పివీదేనని, భూసంస్కరణల కారణంగానే పివి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఏడాది నుంచి పివి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పివి ఆదర్శాలు నిరంతరం కొనసాగాలని ఆయన సూచించారు.

పివి విగ్రహం పెట్టాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమని అన్నారు. పివి రనచలు, సాహిత్యంతో తనకు అనుబంధం ఉందని చెప్పారు. పివికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని ఆయన అన్నారు. పివికి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. త్వరలోనే పివి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆచరణలో పివి విప్లవాత్మక మార్పులు తెచ్చారని కెసిఆర్ అన్నారు. పివి తాను నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టారని అన్నారు.

పివికి కెసిఆర్ నివాళి

పివికి కెసిఆర్ నివాళి

93వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాజీ ప్రధాని పివి నర్సింహరావుకు నివాళులు అర్పించారు.

పివికి కెసిఆర్ నివాళి

పివికి కెసిఆర్ నివాళి

పివి నర్సింహారావు చిత్రపటానికి పివి జ్ఝాన భూమిలో పూలమాల వేసి కె చంద్రశేఖరరావు నివాళులు అర్పించారు.

పివికి కెసిఆర్ నివాళి

పివికి కెసిఆర్ నివాళి

పివి నర్సింహారావుకు జ్ఝానభూమిలో కెసిఆర్‌తో పాటు గవర్నర్ నరసింహన్, తదితరులు నివాళులు అర్పించారు.

పివికి కెసిఆర్ నివాళి

పివికి కెసిఆర్ నివాళి

పివి 93వ జయంతి సందర్భంగా ఏర్పాటైన సభలో తెలంగాణ సిఎం కెసిఆర్ పివికి నివాళులు అర్పించి ఇలా జ్యోతిని వెలిగించారు.

పివికి కెసిఆర్ నివాళి

పివికి కెసిఆర్ నివాళి

పివి నర్సింహారావు 93వ జయంతి సందర్భంగా ఏర్పాటైన సభలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో కెసిఆర్ ఇలా...

పివికి కెసిఆర్ నివాళి

పివికి కెసిఆర్ నివాళి

పివి నర్సింహారావు జయంతి సందర్భంగా ఏర్పాటైన సభలో కెసిఆర్‌తో పాటు గవర్నర్ నరసింహన్, తదితరులు ఇలా..

పివికి రమణాచారి నివాళులు

పివికి రమణాచారి నివాళులు

పివి నర్సింహారావుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి ఇలా నివాళులు అర్పించారు.

పివి కుటుంబ సభ్యులు

పివి కుటుంబ సభ్యులు

పివి నర్సింహారావుకు ఆయన కుమారుడు పివి రాజేశ్వర రావు, ఇతర కుటుంబ సభ్యులు ఇలా నివాళులు అర్పించారు.

ల్వకుంట్ల కవిత నివాళి

ల్వకుంట్ల కవిత నివాళి

మాజీ ప్రధాని పివి నర్సింహారావుకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు.

ఈటెల రాజేందర్ నివాళి

ఈటెల రాజేందర్ నివాళి

మాజీ ప్రధాని పివి నర్సింహారావుకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నివాళులు అర్పించారు.

గవర్నర్ నివాళులు

గవర్నర్ నివాళులు

మాజీ ప్రధాని పివి నర్సింహారావుకు గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. పివి ఎంతో ఆత్మీయంగా పలకరించేవారని తదనంతరం జరిగిన సభలో ఆయన అన్నారు.

నాయని నర్సింహారెడ్డి నివాళులు

నాయని నర్సింహారెడ్డి నివాళులు

మాజీ ప్రధాని పివి నర్సింహారావుకు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి నివాళులు అర్పించారు.

పివి నర్సింహారావు దేశప్రజలకు ఎంతో సేవ చేశారని రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ అన్నారు. పివి నర్సింహారావు అద్భుతమైన ప్రసంగాలు చేశారని, అవి యువతకు ఆదర్శమని, వాటిని యువతకు అందించడానికి పివి మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పివి గాడిలో పెట్టారని ఆయన అన్నారు. పివి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమెరికా సెనేట్‌లో పివి చేసిన ప్రసంగం అనిర్వచనీయమని అన్నారు. ఎప్పుడు కలిసినా పివి ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు.

ఆ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, జ్జానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు బండారు దత్తాత్రేయ, జితేందర్ రెడ్డి, కేశవరావు, కవిత, పివి రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. పివి కూతురు వాణి వందన సమర్పణ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+