కెసిఆర్ సంకేతాలు: ఒంటరి పోరే, పొత్తుకూ నో?

తెరాస కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఒంటరి పోరుకు సిద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం బాధ్యత తమపై ఉందనే కారణం చూపిస్తూ కాంగ్రెసుతో పొత్తును గానీ, విలీనాన్ని గానీ ఆయన వ్యతిరేకించే అవకాశాలున్నాయి.
కాగా, కేంద్ర మంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యలను కూడా కెసిఆర్ సాకుగా చూపించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అలాగే, భద్రాచలం ఏరియాలోని ముంపు గ్రామాలను సీమాంధ్రకు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణ ఇస్తే కాంగ్రెసులో పార్టీని విలీనం చేస్తానని చెప్పిన కెసిఆర్ దాని నుంచి వెనక్కి వెళ్లడానికి తగిన కారణాలను ఇప్పటికే పోగు చేసుకున్నారు. కాంగ్రెసులో విలీనమైతే చిరంజీవికి, ఆయన పార్టీకి ఎదురైన పరిస్థితే తనకు కూడా ఎదురవుతుందే అనుమానాలు కూడా కెసిఆర్‌కు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications