వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌లో తెలుగువారిపై కెసిఆర్ ఆరా: హెల్ప్ లైన్లు ఇవే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగువారి విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆరా తీశారు. ఈ విషయంపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్లను కూడా తెలంగాణ ప్రభుత్వం మంగళవారంనాడు ఏర్పాటు చేసింది.

ఇరాక్‌లో తెలంగాణకు చెందిన ప్రజలు, కార్మికులు ఎవరైనా చిక్కుకున్నారేమో తెలుసుకోవడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తమవారు ఎవరైనా ఇరాక్‌లో చిక్కుకుంటే జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎస్పీలను సంప్రదించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

KCR takes action to save Telugu people in Iraq

పేరు, పాస్‌పోర్టు నెంబర్, ఇరాక్‌లో వారు ఉంటున్న చోటు, ఏ కంపెనీకి పనిచేస్తున్నారు, ఇరాక్‌లో స్థానిక చిరునామా, కాంటాక్టు నెంబర్లు, ఇతర ఉపయోగకరమైన సమాచారాన్ని ప్రజలు అందించేలా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేసింది. దాని వల్ల ప్రభుత్వం ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, బగ్దాద్‌లోని ఇండియన్ మిషన్‌ను సంప్రదించి తగిన సహాయం చేయడానికి వీలవుతుందని తెలిపింది.

బగ్దాద్‌లోని ఇండియన్ మిషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ల నెంబర్లు
00964 770 444 4899, 00964 770 484 3247 (మొబైల్)

హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో కూడా ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు .
ఇ. చిట్టిబాబు, సెక్షన్ ఆఫీసర్ (ఐ/సి)
ఫోన్ నెంబర్ - 040 - 23220603, మొబైల్ - 94408 54433
ఈ మెయిల్ ఐడి - [email protected]

English summary
Telangana government has taken steps to help Telugu people stranded in Iraq and helplines were given.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X