సింగపూర్ టు కౌలాలంపూర్: కారులో.. రోడ్డుపై కేసీఆర్
హైదరాబాద్: సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం సింగపూర్ నుండి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వరకు రోడ్డు మార్గంలో కారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సింగపూర్ - కౌలాలంపూర్ మధ్య ఉన్న శాటిలైట్ టౌన్‌షిప్‌లను పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం కింద ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక కారిడార్లలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

సింగపూర్ - మలేషియాల మధ్య ఈ తరహా టౌన్‌షిప్‌లు ఉండటంతో వాటిని కేసీఆర్ ప్రత్యేకంగా సందర్శించారు. మార్గమధ్యంలో ఆయన పలుచోట్ల ఆగి, అక్కడి స్థితిగతులను చూశారు. టౌన్‌షిప్‌లలో మౌలిక వసతులు, మొక్కల పెంపకం, ఇతర పర్యావరణ చర్యలను ఆయన పరిశీలించారు.












Click it and Unblock the Notifications