టీడీపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేఈ, చంద్రబాబు మందలించలేదు
కర్నూలు: జిల్లాలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష విజయవంతం అయిందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం అన్నారు. దీక్షకు వచ్చిన స్పందనతో కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ పార్టీ కావడంతో ఇతర పార్టీలతో పొత్తులు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు.

కాగా, రెండు రోజుల క్రితం కూడా కేఈ పొత్తుపై మాట్లాడారు. పొత్తు మీద బహిరంగంగా మాట్లాడటంపై టీడీపీ నేతలు కొందరు పరోక్షంగా విమర్శించారు. పార్టీ వేదికల్లో అభిప్రాయం చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ కేడర్‌కు ఏం సందేశమిస్తున్నారని కేఈని ఉద్దేశించి వర్ల అన్నారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికని డిప్యూటీ సీఎం కేఈ మండిపడ్డారు.
కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని కేఈ అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పారు. ఈ విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications