విధేయుడినే! తప్పయితే మన్నించండి: చంద్రబాబుకు కేఈ లేఖ
విజయవాడ: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీని విమర్శిస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుగుదేశం పార్టీ నేత కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆదివారం ఓ లేఖ రాశారు.
టీజీ వెంకటేష్‌ను రాజ్యసభకు ఎంపిక చేయడంపై నిరసనగా కర్నూలు టిడిపి కార్యాలయం ముందు కేఈ ప్రభాకర్ కొద్దిరోజుల క్రితం నిరసన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు బీసీ సంఘాలు వచ్చిన నేపథ్యంలో ఆ పని చేశానని చెప్పిన కెఈ.. ఈ విషయంలో తాను తప్పుచేశానని భావిస్తే, మన్నించాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కోరారు.
తాను ఎప్పుడూ పార్టీకి విధేయుడినేనని.. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు చేయబోనని పేర్కొన్నారు. కర్నూలు టిడిపి కార్యాలయం ముందు కేఈ ప్రభాకర్ ధర్నా చేయడంపై ఆ పార్టీ కార్యాక్రమాల కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. దీనికి సమాధానంగా కేఈ ప్రభాకర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

నేడు చంద్రబాబుతో తెలంగాణ నేతల సమావేశం
హైదరాబాద్: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలతో సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో సమీక్ష జరపనున్నారు. తెలంగాణశాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలంతా దీనికి హాజరుకానున్నారు.
ఇటీవలముగిసిన మహానాడులో, అంతకుముందు జిల్లా మినీ మహానాడుల్లో చేసిన తీర్మానాల అమలుకు చేపట్టాల్సిన చర్యలు, తెలంగాణలో పార్టీ పనితీరుపై చంద్రబాబు సమీక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications