టీడీపీ అక్కడ ఓడితేనే అధికారం, కానీ - ఇదీ లెక్క..!!
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. కూటమి, వైసీపీ అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ పూర్తయి వారం రోజులు అవుతున్నా..ఇంకా అధికారం ఎవరనేది స్పష్టత రావటం లేదు. జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి నేతలు తమదే గెలుపు అని చెబుతున్నారు. ఈ సమయంలో గెలుపు అంచనాలతో పాటుగా సెంటిమెంట్ అంశాలు ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి.
అధికారం దక్కేదెవరికి
ఈ సారి ఏపీలో ఎవరికి అధికారం దక్కుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎవరికి వారు పైకి ధీమాగా కనిపిస్తున్నారు.లోలోపల మాత్రం ఇంకా స్పష్టత లేక కసరత్తు చేస్తున్నారు. సీఎం జగన్ ఐ ప్యాక్ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. జగన్ వ్యాఖ్యలను టీడీపీ ఇప్పటి వరకు ఖండించలేదు. తాము ఎన్ని సీట్లలో గెలుస్తామనేది టీడీపీ ముఖ్య నేతలు స్పందించలేదు. ఇక, ప్రశాంత్ కిషోర్ తాజాగా స్పందించారు. జగన్ చెబుతున్నట్లుగా 151 సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కూటమి గెలుస్తుందని చెప్పుకొచ్చారు. కూటమిలోని మూడు పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల ఫలితాల అంచనాల పైన స్పందించటం లేదు.

సెంటిమెంట్ పై చర్చ
సోషల్ మీడియాలో మాత్రం ఎవరి అంచనాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ సెంటిమెంట్ అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ సీటు పైన చర్చ సాగుతోంది. ఉరవకొండలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదనేది చాలా కాలంగా కనిపిస్తున్న సెంటిమెంట్. 2004,2009,2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచారు. కానీ, రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. దీంతో..ఇప్పుడు ఉరవకొండలో ఎవరు గెలుస్తున్నారంటూ రాజకీయంగా ఆసక్తి కర చర్చ మొదలైంది. టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్...వైసీపీ నుంచి మరోసారి విశ్వేశ్వర రెడ్డి పోటీలో ఉన్నారు. గెలుపు పైన ఇద్దరు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..గెలుపు పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.

గెలుపు దక్కేదెవరికి
ఇక్కడ టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో అధికారం దక్కదనే వాదన ఉంది. రాయసీమలో మెజార్టీ సీట్లు సాధిస్తామని వైసీపీ ధీమాగా ఉంది. అదే రాయలసీమలో 2019లో 3 సీట్లు గెలిచిన టీడీపీ...ఇప్పుడు మెజార్టీ సీట్లు సాధిస్తామని చెబుతోంది. అయితే..వైసీపీ మాత్రం కుప్పంలో కూడా విజయం దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ లో 2019లో 86.20 శాతం పోల్ అవ్వగా..ఈ ఎన్నికల్లో 85.78 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సరళి తరువాత రెండు పార్టీల అభ్యర్దులు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. దీంతో..ఉరవకొండ సెంటిమెంట్ ఈ సారి ఎన్నికల్లో రిపీట్ అవుతుందా లేదా అనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications