Vijayawada: కేశినేని నాని విమర్శలకు చిన్ని కౌంటర్- దమ్ముంటే నిరూపించు-చేతకాకే మూత..!
విజయవాడ లోక్ సభ స్ధానంలో కేశినేని బ్రదర్స్ పోరు హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన టికెట్ తెచ్చుకున్న కేశినేని నానిపై ఆయన సోదరుడు టీడీపీ నుంచి బరిలోకి దిగడంతో మొదలైన ఈ పోరు.. ఇప్పుడు ఎన్నికల వేళ పతాకస్దాయికి చేరింది. తన సోదరుడు చిన్ని అక్రమాస్తులు సంపాదించాడని, ఆయనపై క్రిమినల్ కేసులున్నాయంటూ నాని చేసిన విమర్శలకు ఇవాళ చిన్ని కౌంటర్ ఇచ్చారు. తనపై ఎలాంటి కేసులూ లేవని, ఉంటే నిరూపించాలన్నారు.
తనకు అక్రమాస్తులు, క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కేశినేని నాని చేసిన విమర్శలపై స్పందించిన చిన్ని ఆయనకు వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతా అని హెచ్చరించారు. భవిష్యత్తు లో ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేశామో తాము చెబుతున్నామని, కేశినేని నాని మాత్రం తమపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

కలల రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని చిన్ని ఆరోపించారు. ప్రజల ఆర్ధిక వనరులు దెబ్బ తీసి పొట్ట కొట్టారన్నారు. కేశినేని నాని పదేళ్లల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పలేరా అని నిలదీశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏం చేశావో చెప్పాలన్నారు. నా కారు నంబర్, నా స్టిక్కర్ వాడాడు అంటారని, తనపై అనేక కేసులు ఉన్నాయంటున్న నానికి దమ్ముంటే అవన్నీ నిరూపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల సంఘానికి చూపించాలన్నారు.
తన మీద నిందలు వేస్తూ ప్రజా సమస్యలుగా చిత్రీకరిస్తావా అని కేశినేని నానిని చిన్ని ప్రశ్నించారు. అసలు ప్రజలకు ఏం చేశావో ఎందుకు చెప్పడం లేదన్నారు. పదేళ్లు ఎంపిగా ఎన్ని అభివృద్ధి పనులు చేశావో చెప్పాలన్నారు. ఫ్లైఓవర్ ల నిర్మాణం నీ వల్ల జరిగిందా అని అడిగారు. అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా నువ్వు ఒక్కడివే ఫ్లైఓవర్ కట్టావా అని ప్రశ్నించారు. ఆనాడు సిఎంగా చంద్రబాబు స్థలాలు ఇచ్చి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఎంపీగా ఢిల్లి వెళ్లి వస్తే... అన్నీ నువ్వే చేసినట్లా అన్నారు. రైల్వే ప్రాజెక్టు ల గురించి ఎప్పుడైనా మాట్లాడావా అని నిలదీశారు.
కరోనా సమయంలో అడ్రెస్ లేకుండా ప్రజలను వదిలేసి వెళ్లిపోయారంటూ కేశినేని నానిపై చిన్ని విమర్శలు గుప్పించారు. నీ ఆధ్వర్యంలో ఒక్క కొత్త ఆసుపత్రి అయినా తెచ్చావా అని అడిగారు. చంద్రబాబు సిఎంగా ఉండి ఉంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చూపించేవారన్నారు. జగన్ సంకన దాక్కున్న నువ్వు, ఆయన్ని నిలదీసే దమ్ముందా అని అడిగారు. అసలు విజయవాడ అభివృద్ధి కి జగన్ ఏం చేశాడో అడగాలన్నారు. రాజకీయంగా ధైర్యం గా ఎదుర్కోలేక ఎదుటి వాళ్లపై నిందలు వేయడమే నీ పనా అని ప్రశ్నించారు. అడిగిన వాటికి సూటిగా జవాబు ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

పీవీపీపై నోరు పారేసుకుని నోటీసు అందుకోగానే కాళ్ల మీద పడిన వ్యక్తివి నీవు అని చిన్ని గుర్తుచేశారు. తన మీద ఎటువంటి కేసులు ఉన్నా , రేరా కేసు ఉన్నా నిరూపించాలన్నారు. అబద్దాలతో బతకడం మాని, వాస్తవాలు చెప్పాలన్నారు. ల్యాండ్ గ్రాబర్ అని ప్రచారం చేస్తున్నావు.. ఎక్కడెక్కడ ఏమున్నాయో బయట పెట్టాలన్నారు. నీ ఆఫీస్ పక్కన స్థలం కబ్జా చేయాలని చూస్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. నీ అరాచకాలు, భూకబ్జాల పై నీ సాక్షితో అన్ని మీడియా ల్లో ఆధారాలు ఉన్నాయన్నారు.
చిరంజీవి కన్నా గొప్ప నటుడని నాని నిరూపించుకున్నాడని చిన్ని విమర్శించారు. కలల రాజధాని అమరావతి వద్దు అని చెప్పడానికి సిగ్గు, శరం ఉందా అని అడిగారు. విజయవాడ పార్లమెంటు కు పోటీ చేసే అర్హత నీకు ఉందా అన్నారు. జగన్ తో జత కడితే... పైశాచికత్వం బయటకి వచ్చిందా అని అడిగారు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి ని అభివృద్ధి చేస్తామన్నారు. మీ నాయకుడు జగన్ పై ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలియదా అని ప్రశ్నించారు. వాటి గురించి మాట్లాడు... హామీలు అమలు చేయలేదని జగన్ ను ప్రశ్నించాలన్నారు.
పార్టీ ఆఫీస్ ల పైనా, టీడీపీ కార్యకర్తలు ఇంటిపైనా దాడి చేసిన చరిత్ర నీ పార్టీది అని చిన్ని మండిపడ్డారు. చంద్రబాబు వారసుడిగా అభివృద్ధి, సంక్షేమం తెలుసు, చేసి చూపుతామన్నారు. జగన్ వారసులుగా బూతులు తిట్టే చరిత్ర మీదన్నారు. భూకబ్జాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని చరిత్ర నీదన్నారు. లేబర్ కోర్టు లో నీ పై కేసులు ఉంది వాస్తవం కాదా అని అడిగారు. మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం.. మాకు పని చేయడమే తెలుసు. తానెప్పుడూ చిరాకు పడను, నోరు పారేసుకోను, ప్రజల కోసం పని చేయడమే తనకు తెలుసన్నారు. నానికి అహంకారం ఎక్కువని, ఈ చిన్నికి ఆదరించే తత్త్వం ఎక్కువన్నారు.
నాని ట్రావెల్స్ మూయడానికి, లోకేష్ కు అసలు సంబంధం ఏమిటన్నారు. బస్సులు నడపలేక, జీతాలు ఇవ్వలేక మూసుకుంది అతనే అన్నారు. ఆనాడు నిబంధనలు కు విరుద్ధంగా బస్సు లు నడపాలని నాని ప్రయత్నం చేశాడని,ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై తిరగబడిన వ్యక్తి నాని అన్నారు. చంద్రబాబు వాస్తవం తెలుసుకుని నానీతో ఆ అధికారికి సారీ చెప్పించారన్నారు. కేశినేని ట్రావెల్ మూసివేతకు నాని అసమర్థతే కారణమన్నారు. మంచి ట్రెండ్ ఉన్న సమయంలో నడపలేక పోయాడన్నారు. తాను దొంగ సంతకం పెట్టానంటున్న నాని, క్రిమినల్ కేసు పెట్టవచ్చు కదా అని సూచించారు.
చెల్లి ఏదో మాట అన్నదని, ఆమె పై రెండు కేసులు పెట్టాడని నానిపై చిన్ని ఆరోపించారు. కేశినేని మా ఇంటి పేరు .. నాకు సర్వ హక్కులూ ఉన్నాయన్నారు. ప్రజా జీవితంలో నాని లాంటి వ్యక్తులు ఉండకూడదన్నారు. సమాజానికే అది మంచిది కాదన్నారు. ఇటీవలి ఒక హోటల్ కూడా నాని ప్రారంభించాడని, 34 కోట్లు అప్పు తీసుకుని ఈ హోటల్ పెట్టాడన్నారు.రాము, హేమంత్ పేరు తో హోటల్ ట్రాన్సఫర్ చేశాడన్నారు. ఆర్వోసీ ఇంటిమేషన్ లేదని, అంటే కుట్ర కోణమే కదా అన్నారు.అప్పులు ఎగ్గొట్టేలా, మళ్లీ లీజుకు కూడా ఇచ్చాడన్నారు. ఇటువంటి అవినీతి, అక్రమాలు చాలా ఉన్నాయన్నారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications