'పుష్కరాల్లోపు దుర్గగుడి ప్లైఓవర్ నిర్మించి చూపిస్తాం'

విజయవాడ: వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు దుర్గగుడి ప్లైఓవర్‌ను నిర్మించి చూపిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చెప్పారు. నగరంలోని కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్ పనులు అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైవే పక్కనున్న ఇళ్లను తొలగిస్తున్నారు.

ఈ క్రమంలో ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు సోమవారం ఫ్లైఓవర్ అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మిస్తామన్నారు.

ఆరు లైన్ల ఫ్లైఓవర్ కింద నాలుగులైన్ల రోడ్డును వేయనున్నట్ల ఆయన తెలిపారు. త్వరలోనే కేంద్ర రవాణా శాఖమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

kesineni nani on durga gudi flyover

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+