సీబీఐకి కొలికపూడి లేఖ..! ఎమ్మెల్యేవో,ఎంపీవో కూడా తెలీదంటూ కేశినేని కౌంటర్..!
విజయవాడ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు గుప్పిస్తున్న మాజీ ఎంపీ కేశినేని నాని వీటి తీవ్రతను పెంచేస్తున్నారు. దీంతో ఎంపీ చిన్ని తన నియోజకవర్గ పరిధిలోని టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును రంగంలోకి దించారు. దీంతో ఆయన ఇవాళ కేశినేని చిన్ని ఆర్ధిక అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ సీబీఐకి లేఖ రాశారు.
ఆర్థిక నేరాలకు పాల్పడటంలో, రుణాలు ఎగ్గొట్టడంలో కేశినేని నాని ఘనపాఠి అని కొలికపూడి ఆరోపించారు. వైసీపీ జెండాతో నాని అజెండా అమలు చేస్తున్నారన్నారు.రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపి కేశినేని శివనాథ్ పై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. షెల్ కంపెనీ లతో నాని ఆదాయాన్ని మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. లిక్కర్ స్కామ్ పై జరిగే సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత పదేళ్లుగా ఎంపి పదవిని ఆయన దుర్వినియోగం చేశారన్నారు.

కేశినేని నాని ఎంపిగా వున్న పదేళ్ల కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరిగింది, ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు నెలల కాలంలో ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ పార్లమెంట్ నియోజవకర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడనే అంశం పై చర్చకు రావాలని నానికి సవాల్ ఆయన విసిరారు. వరదల సమయంలో కేశినేని నాని ఎక్కడ వున్నాడంటూ సూటిగా ప్రశ్నించారు. పది సంవత్సరాల కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని సార్లు పర్యటించారో చెప్పాలన్నారు. జగన్ రెడ్డి అండ్ టీమ్ ను కాపాడే ఎజెండాతో , లిక్కర్ స్కామ్ విచారణ ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకు ఎంపి కేశినేని చిన్ని పై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తే...నాని నైతికంగా ఇబ్బందులు ఎదర్కొంటారని హెచ్చరించారు.
ఇంతకీ ఈ మహానుభావుడు ఎమ్మెల్యేనా ,
— Kesineni Nani (@kesineni_nani) May 13, 2025
ఎంపీనా
"just asking" 😀😀😀
ఇటువంటి బాఫ్యూన్లను తమ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునందుకు ప్రజలు తలపట్టుకుంటున్నారు !!!@ncbn @JaiTDP pic.twitter.com/Ar8AYHTGwl
ఇలా కొలికపూడి చేసిన ఆరోపణలు, లేఖకు రెండు ముక్కల్లో కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. కొలికపూడి సీబీఐకి రాసిన లేఖలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంటరీ కమిటీ మెంబర్ అంటూ వాడిన పదాల్ని గుర్తుచేస్తూ ఎక్స్ లో కేశినేని నాని ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. ఇంతకీ ఈ మహానుభావుడు ఎమ్మెల్యేనా , ఎంపీనా "just asking" 😀😀😀 ఇటువంటి బాఫ్యూన్లను తమ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునందుకు ప్రజలు తలపట్టుకుంటున్నారు !!! అంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications