పోలవరంపై మరో లిఫ్ట్-ప్రాజెక్టు పూర్తవుతున్న వేళ మరో ఎత్తిపోతల-కొత్త అనుమానాలు-కాసుల కక్కుర్తేనా ?
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుండగానే.. మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. అదీ హడావిడిగా 9 నెలల్లోనే ఈ లిఫ్ట్ ను పూర్తి చేసి జాతికి అంకితం చేసేశారు. దీన్ని నిర్మించిన కాంట్రాక్టర్ కు స్పీడ్ గా పని పూర్తి చేసి ఇచ్చినందుకు బోనస్ కూడా ఇచ్చేశారు. ఇందులో అవినీతి జరిగిందని అప్పట్లో విపక్ష వైసీపీ గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. చివరికి పట్టిసీమతో కృష్ణా,గోదావరి నదుల్ని కలిపేసినట్లు చెప్పేసుకుంది. ఇప్పుడు వైసీపీ సర్కార్ లో అదే సీన్ రిపీటయ్యేలా ఉంది.

పోలవరం ప్రాజెక్టు ప్రస్ధానం
ఏపీలో కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల తాగు, సాగునీటి ఆవసరాలు, విద్యుత్ ఉత్పత్తి లక్షంతో బహుళార్దక సాధక ప్రాజెక్టుగా పోలవరం తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు నిర్మించకపోవడంతో కొన్ని లక్షల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయి. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రుల కలగా మారిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో నేతలు తీవ్రంగా ప్రయత్నించినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాలేదు. చివరికి ఏపీ విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు గత టీడీపీ సర్కార్ హయాంలో పనులు ప్రారంభించుకుంది.

పోలవరం ప్రాజెక్టులో అవినీతి
ఏపీకి జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడైతే బీజాలు పడ్డాయో అప్పుడే అవినీతికి కూడా బీజాలు పడినట్లేననే అరోపణలు వెల్లువెత్తాయి. గతంలో వైఎస్ హయాంలో మొదలుకావాల్సిన ఈ ప్రాజెక్టు కాస్తా ఆలస్యమై చివరికి చంద్రబాబు హయాంలో ఏపీకి విభజన హామీ రూపంలో నిర్మాణం మొదలైంది. అయితే బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా పోలవరానికి ఉన్న ప్రత్యేకతల్ని దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రంలోనే అత్యుత్తమ, అతి భారీ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. కానీ ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగానే కొత్త కొత్త లిఫ్ట్ లతో ప్రభుత్వాలు చేస్తున్న ఫీట్లు చూస్తుంటే అసలు ప్రాజెక్టుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలవరంలో లిఫ్ట్ ల కక్కుర్తి
ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి పనులు జరుగుతున్నా గతంలో టీడీపీ సర్కార్ పట్టిసీమ లిఫ్ట్ ను నిర్మించేందుకు సిద్ధమైపోయింది. విపక్షాలు, జలవనరులశాఖ నిపుణులు వద్దన్నా వినకుండా వందల కోట్లు పెట్టి పట్టిసీమ లిఫ్ట్ నిర్మించేసింది. ఇప్పుడు వైసీపీ సర్కార్ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే దశకు చేరుకుందని ఓవైపు చెబుతూనే మరోవైపు కొత్త లిఫ్ట్ కు శ్రీకారం చుడుతోంది. ఆ కాంట్రాక్ట్ ను కూడా ఇప్పటికే పోలవరాన్ని నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్ధకే కట్టబెడుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావస్తుంటే ఈ లిఫ్ట్ ల కక్కుర్తి ఏంటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

బహుళార్దక సాధక ప్రాజెక్టుపై అనుమానాలు
ఓవైపు బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా చెప్పుకుంటూ పలు మార్లు డీపీఆర్ లు మార్చి నిర్మాణం మొదలుపెట్టిన పోలవరంలో తిరిగి లిఫ్ట్ ల వ్యవహారం తెరపైకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వాలు దీనిపై కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. తాగు, సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా పనికొచ్చేలా ఈ ప్రాజెక్టు నిర్మిస్తుండగా.. ఇంకా లిఫ్ట్ ల ద్వారా గోదావరి జిల్లాలకు తాగునీరు ఇస్తామంటూ కొత్త కొత్త లిఫ్ట్ లను టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఎందుకు తెరపైకి తెచ్చాయనేది అందరికీ అనుమానంగానే మిగిలిపోయింది.
పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు అయినప్పుడు ఈ లిఫ్ట్ ల వల్ల జరిగే అదనపు ప్రయోజనం ఏంటన్న దానిపై అటు రైతుల్ని కానీ, ఇటు నిపుణుల్ని కానీ, చివరికి ప్రజల్ని కానీ కన్విన్స్ చేసే పరిస్ధితి ప్రభుత్వాలకు లేదు. కేవలం అధికార బలంతోనే లిఫ్ట్ ల నిర్మాణానికి ప్రభుత్వాలు తెగిస్తున్నాయి.

కాసుల కోసమే లిఫ్ట్ ల దందా?
పోలవరం వంటి భారీ బహుళార్ధ సాధక ప్రాజెక్టు, అదీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం జరుగుతున్నప్పుడు అందులో భాగంగానే కాల్వలు తవ్వి పరివాహక ప్రాంతంలో పొలాలకు సాగునీరు ఇవ్వగలుగుతున్నప్పుడు, చుట్టు పక్కల జిల్లాలకు సైతం తాగునీరు ఇచ్చే పరిస్ధితి ఉన్నప్పుడు కొత్తగా లిఫ్ట్ ల నిర్మాణం వెనుక కాసుల కక్కుర్తి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసుల కక్కుర్తితోనే ప్రభుత్వాలు ఈ లిఫ్ట్ లను తెరపైకి తెస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.
ఇప్పటికే పుష్కరం, తాడిపూడి, పట్టిసీమ రూపంలో మూడు లిఫ్ట్ లు ఉండగా.. పురుషోత్తపట్నం పేరుతో గత టీడీపీ సర్కార్ మరో లిఫ్ట్ తెరపైకి తెచ్చింది. అది పూర్తి కాకుండానే, ఇప్పుడు వైసీపీ సర్కార్ మరో కొత్త లిఫ్ట్ నిర్మాణం ప్రారంబించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈ లిప్ట్ లు కాసుల కోసమే తప్ప జనం కోసం కాదనే చర్చ మొదలైంది.
Recommended Video

లిఫ్ట్ లతో పోలవరం ప్రాజెక్టుకే ఎసరు?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకున్న తరుణంలో ప్రాజెక్ట్ డీపీఆర్ లో లేకపోయినా కొత్త లిఫ్ట్ లను తెరపైకి తెచ్చి నిర్మాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై నీటిపారుదలశాఖ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ లిఫ్ట్ ల నిర్మాణం ద్వారా పోలవరం ప్రాజెక్టుపై ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలుకావడమే కాకుండా అంతిమంగా ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వచ్చే నిధులపైనా ప్రభావం పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ సర్కార్ ఖర్చుపెడుతున్న నిధుల్నే కేంద్రం తిరిగి ఇవ్వడం లేదు. ఎంతో లాబీయింగ్ చేస్తే తప్ప వేల కోట్లు తిరిగి రావడం లేదు. అలాంటిది ఇప్పుడు లిఫ్ట్ ల పేరుతో కొత్త వ్యవహారాల్ని తెరపైకి తెస్తే వాటికి కేంద్రం మద్దతిస్తుందా, లేక వాటిని బూచిగా చూపి అసలు నిధులకు కొర్రీ పెడుతుందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయినా వైసీపీ సర్కార్ మాత్రం ముందుకే వెళుతోంది.
-
LPG పై కేంద్రం మరో కీలక నిర్ణయం-రాష్ట్రాలకు లేఖలు..! -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు











Click it and Unblock the Notifications