Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్! ఇలాంటి వ్యాఖ్యలతో బాధ పెట్టొద్దు: కిడారి సర్వేశ్వరరావు సతీమణి పరమేశ్వరి

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల నక్సల్స్ చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సతీమణి పరమేశ్వరి నిరసన వ్యక్తం చేశారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఆమె ఆందోళన చేపట్టారు.

పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన

పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన

పరమేశ్వరి దీక్షకు ఈపీడీసీఎల్ డైరెక్టర్ శోభా హైమావతి, తెలుగు మహిళా సంఘం నేతలు సంఘీభావం తెలిపారు. టీడీపీలోకి వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచు.. ఆమె ఎందుకు అటువైపు వెళ్లిందో ఆలోచించుకోవాలని పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

పవన్ వ్యాఖ్యలు బాధించాయి..

పవన్ వ్యాఖ్యలు బాధించాయి..


అయితే, తన భర్త హత్యకు గురై నెల కూడా కాకముందే ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం తమనెంతగానో బాధించిందని, కిడారి గురించి ప్రజలందరికీ తెలుసని ఆమె తెలిపారు. తమకు ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దని పరమేశ్వరి కోరారు.

పవన్ క్షమాపణ చెప్పాలి

పవన్ క్షమాపణ చెప్పాలి

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పరమేశ్వరి డిమాండ్ చేశారు. తమకు ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు. కిడారి గురించి తప్పుడు సమాచారంతోనే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అన్నారు.

శవరాజకీయాలు తగదు

శవరాజకీయాలు తగదు

ఇది ఇలా ఉండగా, ఇటీవల మావోయిస్టుల చేతిలో చనిపోయిన సివేరి సోమ భార్య కూడా మండిపడ్డారు. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మావోయిస్టు నేత మీనాదే ప్రాణమా?.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. నిజాయితీ గల నేతలు చనిపోతే విమర్శించడం సరికాదని అన్నారు. శవరాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు.

Recommended Video

    నన్ను సీఎం అనండి అని అడిగి పిలిపించుకున్న పవన్

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+