తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం: ఏం జరిగిందంటే?
తిరుమలలో జూన్ 14న అపహరణకు గురైన బాలుడు చెన్నకేశవ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. బాలుడిని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు శుక్రవారం తమిళనాడులోని నాంకల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.
చెన్నై/తిరుపతి: తిరుమలలో జూన్ 14న అపహరణకు గురైన బాలుడు చెన్నకేశవ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. బాలుడిని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు శుక్రవారం తమిళనాడులోని నాంకల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.
బాలుడి కిడ్నాప్ గురించి తమిళనాడు వార్తా ఛానళ్లలో విస్తృతంగా ప్రసారం కావడంతో భయపడిన కిడ్నాపర్లు బాలుడితో సహా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో నాంకల్ పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తమకు పిల్లలు లేని కారణంగానే కేశవను ఎత్తుకెళ్లామని ఆ కిడ్నాపర్ దంపతులు పోలీసులకు చెప్పడం గమనార్హం. బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. బాలుడు దొరికాడని తెలియడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications