ఎమ్మెల్యేలలో ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణి.. రోజాపై రెచ్చిపోయిన కిరాక్ ఆర్పీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో సినీ, బుల్లి తెర సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ షో లో స్కిట్లు వేసే ఆర్టిస్టులు జనసేన పార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీని గెలిపించడం కోసం పనిచేస్తున్నారు. అయితే ఇటీవల వీరిని ఉద్దేశించి మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు కిరాక్ ఆర్ పి రోజా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రోజా ఏమైనా ఇంటర్నేషనల్ ఆర్టిస్టా
మేమంతా చిన్న చిన్న ఆర్టిస్టులు అయితే, రోజా ఇంటర్నేషనల్ ఆర్టిస్టా.. అంటూ కిరాక్ ఆర్పి మండిపడ్డారు. మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అంటామని, గౌరవించకపోతే రోజా అంటామన్నారు. ఆమె ఏమైనా నేషనల్ అవార్డు ఆర్టిస్టా.. ఆ యువరాణికి ఏమైనా 10నేషనల్ అవార్డులు, 10ఆస్కార్ అవార్డులు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. జనసేనకు సపోర్ట్ చేస్తున్న వాళ్లంతా స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నవారని, జనసేన, టిడిపిపై ఉన్న ఇష్టంతో ప్రచారం చేస్తున్న వారన్నారు.

నీకు దమ్ముంటే ఒక్క క్యారెక్టర్ అయినా చెయ్
ఏపీలో మీరు చేసే అవినీతిపై వ్యతిరేకత ఉందన్నారు. చిన్నచిన్న ఆర్టిస్టులు అంటున్నావు కదా.. నీకు దమ్ముంటే గెటప్ శీను చేసే ఒక క్యారెక్టర్ అయినా నీ జీవితంలో చేయగలవా అంటూ రోజాకు కిరాక్ ఆర్ పి చాలెంజ్ విసిరారు. సుడిగాలి సుధీర్ మ్యాజిక్ షోలు చేస్తూ తన చరిష్మా తో సినిమా హీరో అయ్యాడని, రోజా కంటే వాడికి పదిరెట్లు ఎక్కువ ఫాలోయింగ్ ఉందని కిరాక్ పార్టీ వ్యాఖ్యలు చేశారు.
వాళ్ళతో నువ్ పోటీ పడగలవా
సుడిగాలి సుధీర్ తో రోజా పోటీ పడగలదా అని ప్రశ్నించారు. అంతే కాదు హైపర్ ఆది జబర్దస్త్ చరిత్రనే మార్చాడని, అది వేసే పంచులకు రోజా జడ్జిమెంట్ ఇస్తే చాలని, కానీ ఆది గంటపాటు అందరిని ఏకధాటిగా నవ్వించి ట్రెండ్ సెట్టర్ అయ్యాడు అన్నారు. ఆదితో నువ్వు పోటీ పడగలవా అంటూ రోజాను ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలలో ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణి
నీ బతుకులో ఎప్పుడైనా ఈ ముగ్గురు లాంటి చరిష్మా చూసావా? నిన్నెవరు ఒక మాట కూడా అన్నప్పుడు నీకెందుకు ఉలుకెక్కువ అంటూ ప్రశ్నించారు.నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుందని, ఈసారి ఎమ్మెల్యేలలో ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణి.. మా రోజమ్మ అంటూ కిరాక్ ఆర్పి రెచ్చిపోయారు. నీకు నగరిలో డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యలు చేశారు.

నువ్వు ప్రచారం చేసినా, చేయకపోయినా ఓడిపోతావు
మేము ఎప్పుడు నీ గురించి తప్పుగా మాట్లాడలేదు, మా వాళ్ళు వెళ్లి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తే నీకెందుకు అంటూ రోజాపై సీరియస్ అయ్యారు కిరాక్ ఆర్ పి. నువ్వు పబ్లిసిటీ చేసినా ఓడిపోతావని, చెయ్యకపోయినా ఓడిపోతావని, వీలైతే జనసేనకు వచ్చి మద్దతు పలుకు.. నీ బతుకు బాగుంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
అందరూ నీలా దిగజారిపోతారా
ఏడు మంది హీరోలు మెగా ఫ్యామిలీ లో ఉంటే, 70 మంది రౌడీలు మీ అన్న దగ్గర ఉన్నారని వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్ పి.. నీకు దమ్ముంటే ఆయనని ఎదిరించి మాట్లాడు, ఆయనే నిన్ను లేపేస్తాడేమో చూద్దాం అంటూ వ్యాఖ్యలు చేశారు.ప్రతి ఒక్కరు నీలాగా దిగజారిపోయి అందరి వెనుక తిరుగుతా బ్రతుకుతారు అని అనుకోవడం లేదన్నారు కిరాక్ ఆర్పి.












Click it and Unblock the Notifications