సోనియా మాటెలా ఇస్తారు: హరి, బాబు, జగన్‌లపై కిరణ్

 Kiran blames Chandrababu and YS Jagan
విశాఖ: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల పైన నిప్పులు చెరిగారు. విశాఖలో జై సమైక్యాంధ్ర పార్టీ తెలుగుజాతి ఆత్మగౌరవ సభలో మాట్లాడారు.

విద్య, వైద్య, ఉద్యోగ సదుపాయాలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయిని అలాంటిది రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్‌ను ఒక ప్రాంతానికి కేటాయిస్తే ఎలాగని కిరణ్ ప్రశ్నించారు. సీమాంధ్రలో 150 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలంగాణలో కరెంటు లోటు ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

ఇరు ప్రాంతాలకు ఎన్నో సమస్యలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రం కలిసుంటేనే మంచిదని తెలిపారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసు పార్టీని వీడారని, ఆ తర్వాత విభజనకు సహకరించారన్నారు. తాను తెచ్చిన ఈ సేవను కిరణ్ మీ సేవ చేశారని చంద్రబాబు అనడం విడ్డూరమన్నారు. అలా మాట్లాడినందుకు ఆయన తెలివైనా వాడు అనుకోవాలా లేక ప్రజలను మభ్య పెడుతున్నారనుకోవాలా అన్నారు.

సోనియాకు మాటిచ్చే హక్కు లేదు: సబ్బం

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై మాటిచ్చినందువల్లే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని కాంగ్రెసు పార్టీ చెబుతోందని, సోనియాకు అసలు మాట ఇచ్చే అధికారమే లేదని అన్నారు. జివోఎంలో ఒక్క తెలుగు వారు లేరన్నారు.

మునిగిపోతుంది: జగ్గారెడ్డి

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. 90 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరే నేతలు నిండా మునిగిపోవడం ఖాయమన్నారు.

బడుగు, బలహీన వర్గాలే: పొన్నాల

తెలంగాణ ఉద్యమంలో బడుగు, బలహీన వర్గాలే పాల్గొన్నాయని టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బడుగు, బలహీన వర్గాలకోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరుస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+