కొర్రీలతో విసుగు: కొత్త పార్టీపై కిరణ్ రెడ్డి డైలమా?

హైదరాబాద్: కొత్త పార్టీ ఏర్పాటుపై కిరణ్‌కుమార్‌రెడ్డి డైలమాలోనే ఉన్నారు. పార్టీ ఏర్పాటు అంశంపై ఆయన పెడుతున్న సమీక్షల్లో కొంతమంది కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ ప్రకటన అంశం తెర వెనుకకు వెళ్లిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని ఆంటున్నారు. అంతేకాకుండా, ఇంతకు ముందు హామీ ఇచ్చిన కొంత మంది కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మాజీలుగా మారుతున్న మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాధ్ మాత్రమే కిరణ్‌ రెడ్డితో ఉంటారని తెలుస్తోంది. మిగిలిన వారంతా ఎవరి దారి వారు చూసుకుంటుండడంతో ముగ్గురితో పార్టీ ప్రారంభమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Kiran kumar Reddy in dilemma on new party

గత నెల 19న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కిరణ్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి ఊతమిస్తున్నట్లుగానే కిరణ్ కూడా వివిధ వర్గాలతో వరుస భేటీలు నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం రాజమండ్రిలో సభ ఏర్పాటుచేసి పార్టీ ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే, కార్యరూపం దాల్చలేదు.

మరోసారి సమావేశం ఏర్పాటు చేసి మరింత లోతుగా చర్చించి పార్టీ ఏర్పాటుపై స్పష్టతకు రావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ పెట్టాలని భావిస్తే రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి పార్టీ ప్రకటన చేసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

అయితే, ఇప్పటికీ తాను పార్టీ ఏర్పాటుచేస్తే ఎంతమంది తనతో కలిసి వస్తారన్న కోణంలో కిరణ్ కుమార్ ఆరా తీస్తున్నారు. గతంలో పది మందికిపైగా మంత్రులు, ఏభై మందికి పైగా శాసనసభ్యులు కొత్త పార్టీలో చేరుతారని భావించినప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. కేవలం ఇద్దరు మంత్రులు, పాతిక మంది వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కిరణ్‌తో వచ్చే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+