Kiran kumar Reddy : కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన నల్లారి..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కమలం కండువా కప్పి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని, రెండు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తి అని ప్రహ్లాద్ జోషి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సేవలను ఏపీలో సమర్థవంతంగా వినియోగించుకుంటామని చెప్పారు.
అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన కుటుంబం కాంగ్రెస్ పార్టీతో 60 ఏళ్లకు పైగా అనుబంధం కలిగి ఉందని చెప్పారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడుతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడుతుండటంపై తనదైన వివరణ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోతూ వచ్చిందని గుర్తుచేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకుడు. అక్కడ కొంత వరకు ప్రభావితం చేయగల సామర్థ్యం తనకుంది. దీంతో రాయలసీమ ప్రాంతంలో ముందుగా బీజేపీని బలోపేతం చేయడం ఆయన ముందున్న తొలి కర్తవ్యం.అంతేకాదు కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో బీజేపీకి ఏపీలో మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ద్వారాలు తెరుచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications