మరో 3 వారాలు: రాష్ట్రపతికి కిరణ్ లేఖ, ఆ బిల్లే కావాలి

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చించేందుకు మరో మూడు వారాల గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. మంగళవారం అసెంబ్లీలో గందరగోళం చెలరేగడంతో సభాపతి సభను బుధవారానికి వాయిదా వేశారు.

అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తాను మరో మూడు వారాల గడువు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశానని చెప్పారు. అసెంబ్లీకి వచ్చిన బిల్లు అసలైనాదా లేక నకిలీదా అని తాను అనలేదన్నారు.

Kiran Kumar Reddy

కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చించేందుకు మరికొంత సమయం కావాలని ప్రణబ్‌కు రాసిన లేఖలో కోరారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టే పూర్తిస్థాయి బిల్లు అసెంబ్లీకి రాలేదని, ఆ బిల్లునే తాము కావాలని కోరుతున్నామని కిరణ్ పేర్కొన్నారు. పలువురు మంత్రులు, ఆయా పార్టీల సభ్యులు ఇంకా సభలో మాట్లాడాల్సి ఉందని, కాబట్టి గడువు పెంచాలని కోరారు.

గతంలో కూడా కిరణ్ చర్చకు గడువు పెంచాలని రాష్ట్రపతిని కోరారు. నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు. అయితే కేంద్రం, రాష్ట్రపతి తర్జన భర్జనల అనంతరం కేవలం ఒక వారం గడువు ఇచ్చింది. దీంతో 23న పంపించాల్సిన బిల్లుకు 30వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇప్పుడు మరో మూడు వారాలు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+