కిరణ్ దీక్షవేదిక మార్పు: కౌంటర్‌గా టి నేతలు, దామోదర

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అధిష్ఠానంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెండు లేక మూడు రోజులు ఢిల్లీలో ఉండి విభజన అడ్డుకునే ప్రయత్నాలు కలసికట్టుగా చేస్తామని అన్నారు. శాసనసభ, శాసనమండలిలో ఓడిపోయిన బిల్లును ఏ ప్రాతిపదికన ఆమోదిస్తారని అధిష్ఠానాన్ని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నియంత అని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మండిపడ్డారు. కిరణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు మొదట తెలంగాణకు అనుకూలమని చెప్పి ఆ తర్వాత మాట మార్చారని ఆరోపించారు. సీమాంధ్రులకు ఎంత కావాలంటే అంత తీసుకుని వారి ప్రాంతానికి వెళ్లిపోవాలన్నారు.
తెలంగాణకు అడ్డుపడకూడదని సీమాంధ్ర నేతలకు విహెచ్ హితవు పలికారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుందన్నారు. అన్ని పార్టీల అంగీకారంతోనే విభజన జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దీక్ష పైన అధిష్టాన మాట్లాడుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, పిసిసి అధినేత, సభాపతులు అందరూ సీమాంధ్ర వారే అన్నారు. మరోవైపు గురువారం రాజ్ ఘాట్ వద్ద తాము శాంతి దీక్ష చేస్తామని టి నేతలు చెప్పారు. ఈ దీక్షలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా పాల్గొంటారు.












Click it and Unblock the Notifications