సుప్రీంకోర్టు వైపు కిరణ్ అడుగు, సిఎస్‌కు దామోదర లేఖ

తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ ఉభయ సభలు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు పైన ఓటింగ్ జరగనప్పటికీ, బిల్లును తిరస్కరిస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం పైన మూజువాణి ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీనిని శాసన సభ, శాసన మండలి తిరస్కరించాయి.
ఈ నేపథ్యంలో కిరణ్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నారు. కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశ పెడితే కనుక అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పెట్టారంటూ ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారని తెలుస్తోంది. ఆయన మంగళవారం ఉదయం దీక్ష కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
సిఎస్‌కు దామోదర లేఖ
సిఎస్ మహంతికి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లేఖ సోమవారం రాశారు. మంత్రి వర్గ ఆమోదం లేకుండా విభజన బిల్లుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలులేదని ఆయన లేఖలో పేర్కొన్నారని సమాచారం. రాష్ట్ర విభజనపై సుప్రీంలో కేసు వేసేందుకు ముఖ్యమంత్రి యోచిస్తున్న నేపథ్యంలో ఆయన లేఖ రాశారు.












Click it and Unblock the Notifications