బౌలర్ బంతి వేయక ముందే అంటే..: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: భవిష్యత్తు గురించి తాను ఎప్పుడు ఆలోచించనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బౌలర్ బంతి వేయకముందే ఫోరో, సిక్సరో కొట్టాలని బ్యాట్స్‌మన్ అనుకుంటే వికెట్ సమర్పించుకున్నట్లేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. తనపై కలిసిన మీడియా ప్రతినిధులతో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయి దాపై చర్చ జరగాలని ఆయన అన్నారు. ఈ నెల 23వరకూ దీనిపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఆ తర్వాతే సందర్భోచిత నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ పెట్టడంపై ఔననిగానీ, కాదనిగానీ స్పష్టంగా చెప్పలేదు. తన దృష్టంతా రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచడంపైనే ఉందన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నుంచి శాసనసభ వ్యవహా రాల శాఖను తప్పించడానికి విభజన అంశానికీ సంబంధం లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ బాగా తగ్గిందని, తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాది 26 శాతం రాబడి ఉంటే రెండో ఏడాది 15 శాతం, ఈ ఏడాది ఏకంగా 9.5 శాతం లోటు ఉందని, దీన్ని భర్తీ చేసేందుకే శ్రీధర్ బాబుకు అత్యంత కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను అప్పగించానని ఆయన వివరించారు.

అది నా పరిధిలోనే ఉన్నా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయానని కిరణ్ రెడ్డి తెలిపారు. శాసనసభలో సమైక్య తీర్మానం చేసేందుకే శ్రీధర్‌బాబును తప్పించారని, అసెంబ్లీ ప్రొరోగ్ వివాదం కూడా దీనికి కారణమన్న అభిప్రాయంపై స్పందిస్తూ... "సభలో కొన్ని నియమనిబంధనలు, సంప్రదాయాలు ఉంటాయి'' అన్నారు. దీనిపై తెలంగాణ నేతల వ్యాఖ్యలమీద స్పందించబోనన్నారు.
తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పార్టీ నేతలపై విమర్శలు చేయలేదని, ఇప్పుడూ వారి వ్యాఖ్యలపై ఎలాంటి విమర్శలూ చేయనని, శాఖల మార్పుపై కేబినెట్ సహచరులకు అధికారికంగా సమాచారం చేరుతుందని ఆయన అన్నారు. ఈ అంశంపై సీఎంగా నా విచక్షణాధికారం మేరకు నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు. ఎప్పుడు? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలకు జవాబిచ్చే అవసరం లేదని ఆయన అన్నారు.
శ్రీధర్‌బాబును సభా వ్యవహారాల నుంచి తప్పించినందున సమా వేశాలకు ఆటంకం కలు గుతుందని తాను భావించడంలేదని ఆయన అన్నారు. అసెంబ్లీలో, మండలిలో నియమ నిబంధనలు, సంప్రదాయాలు, విధానాల మేరకు సభాపతి, చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సభ్యుల అభిప్రాయం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తీర్మానంపై అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీలో చర్చ తర్వాతే ఎలాం టి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచిస్తానని చెప్పారు.
జగన్ మాటలు గాలిలో కలిసిపోయేవే..
చర్చకు మరింత గడువు కోరడంపై, ఉన్న గడువును సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి సారిస్తామని చెప్పారు. సభలో చర్చలో పాల్గొనడమంటే రాష్ట్ర విభజనను అంగీకరించడమేనన్న వైయస్సార్ కాంగ్రెసు వాదనతో విభే దిం చారు. జగన్ టీవీల్లో, బహిరంగ సభల్లో మాట్లాడితే సరి పోదని, అవన్నీ గాలిలో కలిసిపోయేవేనని అన్నారు.
జగన్, చంద్రబాబు పార్టీల అభిప్రాయాలు అసెంబ్లీలోనే బయటపడతాయని చెప్పారు. అవి మాత్రమే రాష్ట్రపతి, కేంద్రం వద్దకు వెళతాయని, బయట ఎన్ని మాట్లాడినా .. గాలిలో కలవడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చాలని తెలంగాణనుంచే అత్యధికంగా లేఖలు వస్తున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications