కిరణ్ సమైక్యాంధ్ర పార్టీ: సిఎం డిపాజిట్‌పై పెద్దిరెడ్డి ప్రతిజ్ఞ

సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కిరణ్ కొత్త పార్టీ పెట్టే వ్యూహంలో ఉన్నారని మండిపడ్డారు. కొత్త పార్టీ తరఫున కిరణ్ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్నారు కిరణ్‌కు డిపాజిట్ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసమే కిరణ్ సమైక్యరాగం అందుకున్నారన్నారు.
ఇన్నాళ్లు సమైక్యం గురించి మాట్లాడని కిరణ్ ప్రజల నాడి చూసి ఇప్పుడు నింపాదిగా స్పందిస్తున్నారని మండిపడ్డారు. దివంగత ప్రధానమంత్రి పివి నర్సింహ రావులా కిరణ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వెన్నుపోటు పొడుస్తారని తాను గతంలో రాసిన లేఖ నిజమైందన్నారు.
ఆయన కాంగ్రెసు పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణష కిరణ్‌లు ఏం చేశారో చెప్పాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తోందన్నారు.
దీంతో కిరణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పడుతున్నాయని విమర్సించారు. వచ్చే నెల 2వతేదిన సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు చేపడుతున్నామన్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో తమ పార్టీ బలంగా ఉందని, తెలంగాణలోని సమైక్యవాదులను కలుపుకుపోతామని చెప్పారు.












Click it and Unblock the Notifications