నగరి గడ్డ.. నిన్ను భూస్థాపితం చేశారు బిడ్డ.. అర్ధమైందా రోజా: కేజే శాంతి చురకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్కే రోజా నగరిలో ఓటమిపాలు కావడంతో రోజా ఇప్పుడు అందరికీ టార్గెట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్న రోజాను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. నగరి నియోజకవర్గంలోనూ రోజా పైన మాటల దాడి కొనసాగుతుంది. సొంత పార్టీ నేతలే నగరి నియోజకవర్గంలో రోజాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

రోజా వల్లే వైసీపీకి శని
మాజీ మంత్రి ఆర్కే రోజా పై నగరి వైసిపి నాయకురాలు కేజే శాంతి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.నగరిలో ప్రజలు రోజాను భూస్థాపితం చేశారని రోజా నగరిలో ఓడిపోవడంతో నియోజకవర్గం అంతా పండగ వాతావరణం ఉందని వ్యాఖ్యానించారు . పదేళ్లుగా నగరికి పట్టిన శని విరగడ అయిందని, రోజా వల్ల వైసీపీకి కూడా శని దాపురించిందని కేజే శాంతి మండిపడ్డారు .

KJ Shanti made shocking comments on roja over her defeat in nagari

నిన్ను నెత్తిన పెట్టుకుని మేమెంతో తప్పు చేశాం
నగరి నియోజకవర్గంలో అరాచకాలు, అక్రమాలు ఒకటేమిటి చెయ్యని దారుణాలు లేవని విమర్శించారు. నగరి నా అడ్డ అన్న రోజాను నగరి బిడ్డలు భూ స్థాపితం చేశారు అంటూ కేజే శాంతి వెల్లడించారు. నగరిని అడ్డాగా చేసుకుని కుటుంబ పాలన అవినీతి పాలన రోజా సాగించిందని మండిపడ్డారు. నగరిలో రాజకీయాలు తెలియని నిన్ను తీసుకువచ్చి నెత్తిన పెట్టుకొని మేమెంతో తప్పు చేసాం అంటూ కేజే శాంతి అభిప్రాయపడ్డారు.

అడుక్కు తిను పో.. అర్ధమైందా రోజా
ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, నగరి ప్రజల దెబ్బ ఎలా ఉంటుందో అర్థమైందా రాజా అంటూ ఎద్దేవా చేశారు. ఇక రోజా బతుకు బస్టాండే నని పేర్కొన్న కేజే శాంతి మళ్లీ షూటింగులకు వెళ్లే అడుక్కు తినుపో అంటూ...అర్థమైందా రోజా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రోజాపై మూకుమ్మడి దాడి చేస్తున్న వైసీపీ నేతలు, నెటిజన్లు
నగరి నియోజకవర్గంలో చాలాకాలంగా రోజాకు, కేజే శాంతి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి మధ్య గొడవలను దిద్ది సయోధ్య కుదిర్చేందుకు జగన్ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు ఏమాత్రం ఫలితాలను ఇవ్వలేదు. ఇక తాజాగా రోజా టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో 45 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలు కావడంతో రోజాపై అందరూ మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+