కేకే సర్వే కిరణ్ కొత్త రాజకీయ వేదిక 'ఏకం'..! అజెండా ఫిక్స్- పోటీ అక్కడే..!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయాన్ని పక్కాగా గణాంకాలతో సహా ఊహించి సంచలనం సృష్టించిన కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ (KK Survey) సంస్థ అధినేత కిరణ్ కొండేటి (Kiran Kondeti) ఇప్పుడు రాజకీయాల్లో నేరుగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఏకం పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. హైదరాబాద్ లో ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో తమ రాజకీయ వేదిక ద్వారా పోటీ, అజెండా, ఇతర అంశాల్ని కూడా కిరణ్ వెల్లడించారు.

వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!
వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!

కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ పేరుతో ఇప్పటికే సంస్థను నడుపుతున్న కిరణ్ కొండేటి..త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఇప్పుడు మరింత క్లారిటీ ఇచ్చారు. ఏకం పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కిరణ్.. తెలుగు రాష్ట్రాల్లో పని చేయబోతున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంక్షేమ జాతరకు వ్యతిరేకంగా తాను ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల అజెండాలు మారాలని కిరణ్ పిలుపునిచ్చారు.

KK Survey Kiran Kondeti Floats Political Outfit Ekam Eyes Electoral Debut in Telugu States
Explainer: జగన్ కోసమే చట్టం చేస్తున్న చంద్రబాబు..! దేశంలో ఇదే తొలిసారి..!
Explainer: జగన్ కోసమే చట్టం చేస్తున్న చంద్రబాబు..! దేశంలో ఇదే తొలిసారి..!

ముఖ్యంగా ఉచిత పథకాలు, నగదు పంపిణీ హామీలకు బదులుగా ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే వాటి లక్ష్యం కావాలన్నారు. ఈ మేరకు తాము కూడా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై పోరాడనున్నట్లు తెలిపారు. తాను ప్రకటించిన ఏకం తరఫున సర్పంచ్ అభ్యర్ధుల్ని బరిలోకి దించనున్నట్లు తెలిపారు. ఇందులో 35 శాతం ఓట్లు వచ్చినా సంక్షేమ పథకాల కంటే ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యమే ముఖ్యమని ప్రజలు తీర్పు ఇచ్చినట్లు అవుతుందని కిరణ్ ప్రకటించారు. ఈ దిశగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని కిరణ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పేరుతో కొత్త పార్టీ స్థాపించడం, మరోవైపు విజయవాడ మేయర్ గా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా కొత్త పార్టీ పెడతానని ప్రకటన చేయడం, ఇప్పుడు ఏకం పేరుతో కిరణ్ రంగంలోకి దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నట్లు అర్దమవుతోంది..

స్కూళ్లకు రెండో శనివారాల సెలవుల రద్దు- ఈ విద్యా సంవత్సరం అంతా..!
స్కూళ్లకు రెండో శనివారాల సెలవుల రద్దు- ఈ విద్యా సంవత్సరం అంతా..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+