భారతదేశంలో అతి వింతైన రైల్వేస్టేషన్ గురించి తెలుసా?

భారతదేశంలోని 98 శాతం ప్రజల ప్రధాన రవాణా సాధణం రైలు. అత్యంత చౌకగా, భద్రంగా తీసుకువెళుతుంది కాబట్టే ప్రయాణికులు దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన్ని ఆశ్రయిస్తారు. ప్రస్తుతం నరేంద్రమోడీ మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ ఎక్కువగా ఉన్న రైల్వేల్లో నాలుగోదిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి మనదేశంలో ఒక వింతైన రైల్వేస్టేషన్ ఉందనే విషయం మీకు తెలుసా?.. దాన్ని గురించి తెలుసుకుందాం.

పారిశ్రామిక ప్రాంతం కావడంతో రద్దీ ఎక్కువ
1883లో బీహార్ లోని బరౌనీలో బ్రిటీషర్లు ఈ రైల్వేస్టేషన్ ను నిర్మించారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో రాకపోకలు ఎక్కువ. ఇక్కడ ఉండే ప్లాట్ ఫారం 1, ప్లాట్ ఫారం 2 మధ్య రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ స్టేషన్ లో ప్లాట్ ఫారం మారాలంటే రెండు కిలోమీటర్లు ప్రయాణించాలి. కాలక్రమేణా బరౌనీ జంక్షన్ రద్దీగా మారుతూ వస్తోంది. దీన్ని నియంత్రించేందుకు కొత్త ప్లాట్ ఫారం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అనుకున్నంత స్థలం దొరకలేదు. దీంతో రెండు కిలోమీటర్లదూరంలో కొత్త ప్లాట్ ఫారం నిర్మించారు.

Know about the uniqueness of Barauni Railway Station in Biharba

ఆటో మాట్లాడుకొని వెళ్లాలి
లగేజీ తీసుకొని ప్రయాణికులు ఒకటో నెంబరు ప్లాట్ ఫారం నుంచి రెండో నెంబరు ప్లాట్ ఫారం వరకు వెళ్లాలంటే ఎంతో వ్యవయప్రయాసలకు గురికావల్సి వస్తోంది. ఆటో లేదంటే రిక్షా మాట్లాడుకొని ప్లాట్ ఫారం మారుతుంటారు. ఈ రెండు ప్లాట్ ఫారాలను కలుపుతూ కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనుకుంటున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల కోసం ఆటోలు, రిక్షాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మనదేశంలో ఉన్న అనేక రైల్వేస్టేషన్లకు ఒక్కోదానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అలాగే బరౌనీ కూడా దాని ప్రత్యకత దానికి ఉంది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినప్పటికీ బరౌనీ స్టేషన్ మాత్రం మరిచిపోలేని అనుభూతిని పంచుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+