చంద్రబాబు పాపం పండింది: కొడాలి నాని; అభినవ శిశుపాలుడు: మంత్రి కొట్టు వ్యాఖ్యలు!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసిపి మంత్రులు,నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికారని, పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేశారని వైసీపీ మంత్రులు, నేతలు చెప్తున్నారు.

తాజాగా చంద్రబాబును ఏపీ సిఐడీ అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండిందని ట్విట్టర్ వేదికగా కొడాలి నాని పోస్ట్ చేశారు. ఇక తన పోస్ట్ కింద కరప్షన్ కింగ్ సిబిఎన్, స్కాం స్టార్ చంద్రబాబు అంటూ హ్యాష్ ట్యాగ్స్ ను జత చేశారు.

Kodali Nani Chandrababu

బాబు అరెస్టుపై తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు.చంద్రబాబు అభినవ శిశుపాలుడు అని పేర్కొన్న మంత్రి చంద్రబాబు ఎట్టకేలకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు చేశారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని అంతా దోచుకోవడానికి ఉపయోగించారని పేర్కొన్న ఆయన వేలకోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు అక్రమ మార్గంలో తరలించారని మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్టు ను బిజెపి, జనసేన, కమ్యూనిస్టులు ఖండించడం హాస్యాస్పదమని మంత్రి కొట్టు సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికి పోయారు అని ఈ కేసుకు సంబంధించి సిఐడి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే చంద్రబాబు ని అరెస్ట్ చేసిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Kottu Satyanarayana

చంద్రబాబుకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం దారుణమని పురందరేశ్వరి ట్వీట్ చేయడం హాస్యాస్పదమని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బిజెపిలో ఉంటూ కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చినా కూడా స్పందించని పురంధరేశ్వరి బాబుని వెనకేసుకు రావడం సిగ్గుచేటని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు అని పేర్కొన్న కొట్టు 100కు మించి నేరాలు చేసి ప్రస్తుతం చట్టానికి చిక్కాడు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+