అప్పటిదాకా భూమ్మీదే ఉంటా: తన ఆరోగ్యంపై కొడాలి నాని క్లారిటీ!!
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ తనపై జరుగుతున్న దుష్ప్రచారం పై తనదైన శైలిలో మండిపడ్డారు.
ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఎటువంటి క్యాన్సర్ లేదని స్పష్టం చేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని కొడాలి నాని పేర్కొన్నారు. ఐ టిడిపి సోషల్ మీడియా వింగ్ తనపై దుష్ప్రచారం చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును రాజకీయాలనుండి ఇంటికి పంపే దాకా తాను భూమ్మీదే ఉంటానని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొంతమంది కావాలని శునకానందం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబును రాజకీయాల నుంచి, ఏపీ నుంచి ఇంటికి పంపించి తీరుతామని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ లకు దమ్ముంటే గుడివాడ రావాలని కొడాలి నాని సవాల్ విసిరారు.
వాళ్ళెవరూ తన వెంట్రుక కూడా పీకలేరు అని కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం పై వస్తున్న వార్తలను వైసిపి నేతలు తీవ్రంగా ఖండించారు. కొడాలి నానీని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనను మానసికంగా దెబ్బ తీయడం కోసం సోషల్ మీడియాలో, కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో ఇటువంటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. జూలై 8వ తేదీన, జూలై 9వ తేదీన కొడాలి నాని వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కొడాలి నానిపై దుష్ప్రచారాలు మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని తీవ్రస్థాయిలో గుడివాడ వైసీపీ నేతలు హెచ్చరించారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా గుడివాడ కొడాలి నానీదే అని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications