సీఎం రేవంత్ రెడ్డిపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్!!
ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం కాల్ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి వర్గం, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి నాని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారని చెప్పారు. కేసీఆర్ కు శస్త్రచికిత్స జరిగింది కాబట్టి ఆయనను సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారని, రేవంత్ రెడ్డికి అలా ఏమైనా జరిగిందా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు.

ఫోన్ చేసి చెప్పడానికి తమ కాంగ్రెస్ పార్టీలో తాము పని చేయడం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అసలు రేవంత్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫోన్ చేయాలని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని సీఎం జగన్ ఎందుకు కలవాలో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం అని, పట్టించుకునే సమయం జగన్మోహన్ రెడ్డికి లేదని కొడాలి నాని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డిది ప్రాంతీయ పార్టీనా... ఆయనేమైన సుప్రీంనా... అని ప్రశ్నించిన కొడాలి నాని ప్రత్యేకంగా ఆయనను కలవాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి షర్మిలకు సపోర్ట్ చేస్తే తమకు ఏంటి అని ప్రశ్నించారు. అవసరమైతే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకున్న తమకు అభ్యంతరం లేదని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని వద్దనే మూసేశామని కొడాలి నాని తెలిపారు.












Click it and Unblock the Notifications