వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ టార్గెట్ 2024 కాదు-అరబిందోతో చంద్రబాబుకూ లింక్ ! కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన వీరిద్దరి రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఢిల్లీ మద్యం స్కాంలో అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్టుపైనా కొడాలి స్పందించారు.

చంద్రబాబుకు జీవితకాలం టైం ఇచ్చామని, పులివెందులలో ఒక్క పంచాయతీ అయినా గెలవాలని కొడాలి నాని సవాల్ విసిరారు. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు, కుప్పంలో ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. జగన్ టార్గెట్ 2024 ఎన్నికలు కాదని, 30 ఏళ్లు ఆయనే అధికారంలో ఉంటారన్నారు. చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలని కొడాలి స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత పవన్ జెండా పీక్కొని పారిపోతాడన్నారు. ఏనుగు లాంటి జగన్ దెబ్బకు, చంద్రబాబు- పవన్,లోకేష్ రాజకీయ అనాధలుగా మిగిలారని కొడాలి ఎద్దేవా చేశారు.

kodali nani says 2024 polls are not jagans target, chandrabbau also have aurobindo link

జనసేన పార్టీని పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు అంకితం చేశాడని కొడాలి నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేకనే, ఇప్పటంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. నోటీసులు ఇచ్చినప్పుడు, గోడలు కూల్చినప్పుడు స్పందించని లోకేష్ నిన్న హడావిడి చేస్తున్నాడన్నారు. ఒకచోట ఓడిపోయిన లోకేష్ తో ప్రయోజనం లేకనే, రెండు చోట్ల ఒడిన పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నాడని నాని తెలిపారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడేనని, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ పై వైసీపీ ఏం సమాధానం చెబుతుందన్న టీడీపీ ప్రశ్నలపై కొడాలి స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని నాని తెలిపారు. అరబిందో సంస్థతో చంద్రబాబుకూ సంబంధం ఉందన్నారు. ఈ విషయంపై దమ్ముంటే చంద్రబాబు ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. 2004 నుంచి 2019 దాకా అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారన్నారు.

English summary
former ysrcp minister kodali nani on today slams chandrababu and pawan kalyan politics around ippatam village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X