చంద్రబాబు వ్యాఖ్యల వల్లే మాచర్ల హింస ? పాలిటిక్స్ లో మామూలే-కొడాలి కామెంట్స్ !

పల్నాడు జిల్లా మాచర్లలో నిన్నటి నుంచి చోటు చేసుకున్న హింసపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ స్పందించారు. మాచర్లలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వివాదం కాస్తా హింసకు దారి తీయడం, పలువురికి గాయాలైన నేపథ్యంలో కొడాలి దీనిపై మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యల వల్లే మాచర్ల హింస చోటు చేసుకుందని మాజీ మంత్రి కొడాలి నాని విశ్లేషించారు. బట్టలూడదీసి కొట్టమని, ఇళ్లలోకి దూరి కొట్టమని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని స్ఫూర్తిగా తీసుకున్న వారే ఈ హింసకు పాల్పడి ఉంటారని కొడాలి తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన మద్దతుదారులు ఊరుకుంటారా అని కొడాలి ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణమేనని వైసీపీ మాజీ మంత్రి తెలిపారు.

kodali nani says macherla violence is common, may be inspired with chandrababu comments

రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదని కొడాలి నాని తెలిపారు.75 ఏళ్ల చంద్రబాబు బట్టలూడదీసి కొడతానని రోజు అంటున్నారని, ఇలాంటి వ్యాఖ్యల వల్లే మాచర్ల హింస చోటు చేసుకుని ఉండొచ్చన్నారు. బహిరంగ సభల్లో చంద్రబాబు మాటలను,మాచర్లలో ఆదర్శంగా తీసుకొని ఉంటారన్నారు. గతంలో వైసీపీ మంత్రి రోజా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న ప్రశ్నకు రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని కొడాలి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+