కొడాలి సంచలన కామెంట్స్- ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా కుట్ర ? లోకేష్ కోసం జూనియర్ ను అందుకే..

ఏపీలో రాజకీయ పరిణామాలపై నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ మరోసారి సంచలన విమర్శలతో రెచ్చిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ వరకూ ఎవరినీ వదలకుండా ప్రస్తావించారు. అన్నింటికీ చంద్రబాబే కారణమనే అర్ధం వచ్చేలా కొడాలి ఇవాళ చేసిన విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి.

రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన విమర్శలు చేశారు. నారా లోకేష్ కోసం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారని మరో ఆరోపణ కూడా చేశారు. అంటే ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన జూనియర్ ను కాదని, నారా లోకేష్ ను అందలెక్కించడం ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కొడాలి పరోక్షంగా ఆరోపించారు. ఇప్పటికే ఈ విమర్శలు జనంలో ఉన్నాయి. అయితే వీటికి ఎన్టీఆర్ డీఎన్ఏతో లింక్ చేసి కొడాలి విమర్శించారు.

kodali nani says tdp conspiracy to remove ntr dna from ap, jr ntrs sidelined for lokesh

అలాగే రాష్ట్రాన్ని ఆక్రమించేందుకు ఓ కులం పన్నాగాలు పన్నుతోందని కొడాలి మరో సంచలన ఆరోపణ చేశారు. అంటే టీడీపీ కులమైన కమ్మ సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందనే అర్ధం వచ్చేలా కొడాలి ఈ ఆరోపణ చేశారు. మరోవైపు తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై జరుగుతున్న చర్చపైనా స్పందించారు. తనను కాదని పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ ను మంత్రిని చేయడంపై ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు కొడాలి జవాబిచ్చారు. జోగి రమేష్ మంత్రి అయితే తాను, మరో మాజీ మంత్రి పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మంత్రులైనట్లేనని కొడాలి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+