హత్యలో కొల్లు రవీంద్రనే కాదు దేవినేని ఉమా ,చంద్రబాబు పాత్ర కూడా .. కొడాలి నాని సంచలనం

టిడిపి నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లడంపై టిడిపి నేతలు నిప్పులుచెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై మాట్లాడిన వైసీపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపినేత మోకాభాస్కర్ రావు హత్యకేసులో కొల్లు రవీంద్ర పాత్ర మాత్రమే కాదు దేవినేని ఉమా, చంద్రబాబు హస్తం కూడా ఉండి ఉంటుందని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొల్లు రవీంద్ర పారిపోవటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు ?

కొల్లు రవీంద్ర పారిపోవటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు ?

కొల్లు రవీంద్ర సూచనమేరకు హత్య చేసినట్లుగా నిందితులు పోలీసులముందు అంగీకరించడం, ప్రాథమిక దర్యాప్తులో కూడా కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా కొల్లు రవీంద్ర దొంగలా పారిపోవడానికి ప్రయత్నం చేశారంటూ కొడాలి నాని పేర్కొన్నారు. హత్యలో తన పాత్ర ఉన్నందున పారిపోయేందుకు ప్రయత్నించాడు అని, అందులో భాగంగానే పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు కొడాలి నాని.

 ఈ హత్యకేసులో రవీంద్ర పాత్రపై పూర్తి ఆధారాలు

ఈ హత్యకేసులో రవీంద్ర పాత్రపై పూర్తి ఆధారాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పేర్నినానికి ప్రధాన అనుచరుడిగా ఉండి,మొదటి నుండి మచిలీపట్నం రాజకీయాలలో కీలక భూమిక పోషించిన మోకా భాస్కరరావు కొల్లు రవీంద్ర కు కంట్లో నలుసులా, చెప్పులో రాయిలా తయారయ్యాడని, అందుకే అడ్డు తొలగించుకోవాలని భావించి హత్య చేయించారని కొడాలి నాని పేర్కొన్నారు. పోలీసుల దగ్గర ఈ హత్యకేసులో రవీంద్ర పాత్రపై పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు.

 బలహీన్న వర్గాల వారిని చంపటానికి టీడీపీ కుట్రలు

బలహీన్న వర్గాల వారిని చంపటానికి టీడీపీ కుట్రలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాలకు చెందిన నాయకులని చంపితే పార్టీ బలహీన పడుతుందన్న భావనతోనే బలహీన వర్గాలకు చెందిన వారిని టిడిపి నేతలు టార్గెట్ చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రతి పనికిమాలిన విషయానికి మీడియా ముందు డబ్బా కొట్టుకునే టిడిపి నేతలు,ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పాలని,విచారణను ఎదుర్కోవాలని కొడాలి నాని తెలిపారు. కానీ పిరికి పందల్లా పారిపోతున్నారని విమర్శించారు .

Recommended Video

    YS Jagan ఫోటో పెట్టుకుని మళ్లీ గెలవండి రా చూస్తాను - Raghu Rama Krishnam Raju
    హత్యా రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే

    హత్యా రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే

    పోలీసులు అన్ని ఆధారాలతోనే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏం ఉంటుందని ప్రశ్నించారు.వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యలో కొల్లు రవీంద్ర పాత్ర లేకుంటే ఎందుకు పారిపోయాడు అంటూ ప్రశ్నించారు కొడాలి నాని. ఆయన ప్రమేయం ఉంది కనుకే పారిపోయాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని పేర్కొన్నారు కొడాలి నానీ .తాజాగా కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+