పురందేశ్వరీ ఖబడ్డార్-నీ లాంటి కూతురు ఎవరికీ ఉండొద్దు-కొడాలి నాని ఫైర్...

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ వర్సెస్ విపక్షాల వార్ ముదురుతోంది. ముఖ్యంగా ఈ మధ్య వైసీపీ ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పురందేశ్వరి టార్గెట్ గా రోజూ ట్వీట్లు పెడుతూ విమర్శలు గుప్పిస్తుండగా.. ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని కూడా రంగంలోకి దిగారు.

పురందేశ్వరి తీరుపై మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ ఫైర్ అయ్యారు. పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి మరణానికి కారణమైన పురందేశ్వరి, ఇప్పుడు టీడీపీకి బీ టీంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురందేశ్వరికి వాటాలు అందాయన్నారు. అప్పుడు నోరు మూసుకున్న పురందేశ్వరి జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతుందన్నారు. వైసీపీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అంటూ పురందేశ్వరిని కొడాలి నాని హెచ్చరించారు.

kodali nani shocking remarks on purandeswari for backing brother-in-law chandrababu

మరోవైపు బెయిల్ కోసమే చంద్రబాబు గుండెకు బొక్క పడిందంటూ నాటకాలు ఆడుతున్నాడని కొడాలి ఎద్దేవా చేశారు. వైసీపీ హయంలో ఇసుకపై 4వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, టీడీపీ హయాంలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని కొడాలి ప్రశ్నించారు. 2014, 2019ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చీకొట్టినా, సిగ్గులేని పొందేశ్వరి నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు.

నిన్నటి వరకు అసెంబ్లీలో బాహుబలి డైలాగులు చెప్పిన చంద్రబాబు, నేడు గుండెకు బొక్క పడింది, శరీరంలో కాయలు పోయాయి అంటూ బెయిల్ కోసం డ్రామాలాడుతున్నాడన్నారు. చంద్రబాబు జీవితమంతా అవినీతి బొక్కలు, మచ్చలతో నిండిపోయిందని కొడాలి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావులేదని, పేద వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమన్నారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+